Menu Close

ఆడది ఏమి చేసినా తప్పే..! తప్పకుండా చదవండి


ఆడది ఏమి చేసినా తప్పే..!

● నవ్వితే అమ్మో ఆపిల్ల చూడండి బుద్ది లేకుండా ఎలా నువ్వుతుంది అంటారు!!!
● ఏడిస్తే దరిద్రం ఎడవకూడదు అంటారు!!!
● నలుగురిలో కలిసిపోతే సిగ్గు ఎగ్గూ లేకుండా చూడండి ఎలా వుందో నలుగురిలో అంటారు!!!!

● నలుగురితో కలవకపోతే ముచ్చు మొహంది అస్సలు కలవదు అంటారు!!!
● బయటకు వెళ్లి అన్ని పనులు చక్కబెట్టుకుంటే అమ్మో..అసాద్యురాలు అంటారు!!!
● బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే చేతకానిది అసమర్థురాలు అంటారు!!!

women life style traditional

● ఉద్యోగం చేస్తే మగరాయుడు అంటారు!!!
● ఇంట్లో ఖాళీగా ఉంటే సోమరి అంటారు!!!
● లక్షణంగా తయారయితే సోకులాడి అంటారు!!!

● చింపిరిగా ఉంటే మోటు మనిషి,,మొరటు మనిషి అంటారు!!!
● భర్తను ప్రపంచంగా భావిస్తే..రెండో పని లేదు మొగుడే ప్రపంచం అంటారు!!!
● భర్తను పట్టించుకోకుండా హద్దుల్లో ఉంటే దానికి పొగరు బెట్టు చేస్తుంది అంటారు!!!

● పిల్లల్ని త్వరగా కంటే ముసలిదయ్యింది అంటారు !!!
● లేటుగా కంటే..ఈలోపు కొన్ని నోర్లు గొడ్రాలు అంటారు!!!
● భర్త బయటకు వెళ్లెప్పుడు ఎదురొస్తే ఈవిడ ఎదురొస్తేనే తిరిగి వస్తారా అంటారు!!!

● భర్త బయటకు వెళ్లెప్పుడు రాకపోతే ఎప్పుడు పని పని,,దీనికి ఇంటి పని తప్ప మొగుడు ధ్యాస ఉండదు పాపం పొద్దునే వెళ్తే ఎప్పుడో రాత్రికి కదా వచ్చేది అంటారు!!!
● భర్త కోసం ఎదురు చూస్తుంటే ఎక్కడికి పోతారు రారా…అంటారు!!!
● ఎదురుచూడకపోతే వాడి జీతం మీద వున్న శ్రద్ధ మనిషి మీద ఉండదు అంటారు!!!

● పిల్లలకి భయం చెప్తే వామ్మో…అది తల్లి కాదు రాక్షసి అంటారు!!!
● ముద్దుగా గారాబంగా పెంచితే హద్దు లేకుండా పెంచుతుంది అంటారు!!!
● ఒక రూపాయి ఖర్చు పెడితే దుబారా అంటారు !!!

● దాచిపెడితే పీనాసి అంటారు !!!
● ఓపెన్ గా మాట్లాడితే ఏది దాచుకోలేదు అంటారు!!
● మౌనంగా ఉంటే పొగరెక్కువ, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడద అంటారు !!!

ఇవన్నీ ప్రతి ఒక్క మహిళ ఏదో సమయంలో ఎదుర్కొంటూనే ఉంటుంది. కాని తానెక్కడ కృంగిపోదు ఎందుకంటే స్త్రీ కాబట్టి మాతృమూర్తి కాబట్టి. తనకి బరించడం ఒక లక్షణం అయిపోయింది కాబట్టి.

దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి.

Share with your friends & family
Posted in Telugu Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading