కొంత మంది పిల్లల కాళ్లకు నల్ల తాడు ఉంటుంది పెద్ధ వాళ్ళ కాళ్ళకు కూడా అప్పుడప్పుడు చూస్తూ వుంటాం. దాన్ని ఎందుకు కట్టారు, ఏంటి ప్రయోజనం అని ప్రత్యేకించి ఎవరూ అడగరు. దాని వెనకున్న కారణం తెలుసుకుందాం.
జ్యోతిష శాస్త్రం ప్రకారం… కంటి చూపుకి శక్తి ఉంటుంది. కొంత మంది కంటి చూపు పడితే… చెడు జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు చాలా సుకుమారంగా, కోమలంగా, అందంగా ఉంటారు. వారిపై చెడు దృష్టి పడకుండా, దిష్టి చుక్కలా… నల్లతాడు కడతారు. ఉత్తరప్రదేశ్‌లోని బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్లు కట్టించే సంస్కృతి ప్రారంభమైందని చెబుతారు.
కొంతమంది పెద్దవాళ్ల కాళ్లకు కూడా నల్లతాడు ఉంటుంది… అది దేనికంటే… జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నవారికి మంగళవారం నాడు ఈ తాడు కడతారు. తద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయనీ, డబ్బు వస్తుందని చెబుతారు. వ్యక్తులకే కాదు… వారు ఉండే ఇంట్లో కూడా డబ్బు కొరత ఉండదని చెబుతారు.
కొంతమందికి కాళ్లలో నొప్పి ఉంటుంది. నడిచేటప్పుడు నొప్పి వస్తుంది. అలాంటి వారు కూడా నల్లతాడు కట్టించుకుంటారు. కాళ్లే కాదు… చేతులు, మెడ, నడుముకి కూడా నల్లతాళ్లు కట్టించుకుంటారు.
నలుపుకి… చెడును లాగేసుకునే శక్తి ఉందని నమ్ముతారు. చీకటిలోనే చెడు శక్తులు ఉంటాయని నమ్ముతారు. అందువల్ల కాళ్లకు నల్లతాడు ఉంటే… దిష్టి మొత్తాన్నీ అది లాగేసుకొని… మేలు చేస్తుందని చెబుతారు. శనిదేవుణ్ని పూజించేటప్పుడు నల్ల తాడు కట్టుకుంటారు. తద్వారా రాహు, కేతు దోషాలు దరిచేరవని నమ్ముతారు. తాడు కట్టుకునేముందు… శనిదేవుడి మంత్రాన్ని 21 సార్లు జపించాలనే నియమం ఉంది.
నల్లతాడును కట్టే ముందే దానికి 9 ముడులు వేస్తారు. ఆ తర్వాతే కడతారు. పిల్లలు పుట్టిన తర్వాత… కొన్ని రోజులకే నల్ల తాడు కట్టేస్తారు. ఆ తాడు వల్ల పిల్లలకు ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. అందువల్ల పెద్దవాళ్లు కూడా… తాడు కట్టించేందుకే ఇష్టపడతారు. ఈ తాడు కట్టిన చెయ్యి లేదా కాలుకు మరే రంగు తాడునూ కట్టకూడదని నియమం ఉంది. నల్ల తాడు కట్టుకున్నాక.. రోజూ రుద్ర గాయత్రీ మంత్రాన్ని జపించాలనీ… తద్వారా ఈ తాడు మరింత శక్తిమంతం అవుతుందని పండితులు చెబుతున్నారు.
హేతువాదులు మాత్రం ఇలాంటి వాటిని తప్పుపడతారు. నల్లతాడేంటి… చెడు శక్తుల్ని లాక్కోవడమేంటి అని వీటిని వ్యతిరేకిస్తారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి అన్నట్లు… శతాబ్దాలుగా మన దేశంలో ఈ నల్లతాడు కట్టించుకునే సంస్కృతి ఇప్పటికీ పల్లెల్లో కొనసాగుతోంది.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.