Menu Close

దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం – Best Stories in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు.
15 ఏళ్లకే మందు తాగడం నేర్చుకున్నాడు.
ఎలాగోలా స్కూల్ చదువు నుండి కాలేజీ కి వచ్చాడు.
అక్కడ పేకాట పడుచు పిల్లల్తో ఆటలు నేర్చుకున్నాడు.
దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

20 ఏళ్ళకే డబ్బు కోసం దొంగతనం నేర్చుకున్నాడు.
అది సరిపోక హత్యలు చేయడము మొదలెట్టాడు.
దొంగ ఎన్ని రోజులో దొరలాగా తిరగలేడు కదా.. ..
ఒకరోజు దొరికిపోయాడు.

మూడేళ్ళ విచారణ తరువాత అతనికి ఉరిశిక్ష పడింది.
మళ్ళీ ఎన్ని అప్పీళ్లు పెట్టుకున్న అవన్నీ కొట్టేసి
ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ రోజును చెప్పేసారు.
చివరగా అతని కోరిక ఏమని అడగగా
తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు.

అతని కోరిక మేరకు వారిని పిలిపించారు
కన్నవాళ్ళు కదా కన్నపిల్లలు రాక్షసులైన ప్రేమిస్తారు.
పోలీసులు, లాయర్లు, సాక్షులు అందరూ మోసం చేసి
నీ ఉరికి కారణమయ్యారని ఏడ్చారు తల్లి తండ్రులు.
అప్పుడు అతను వారు కాదు నా మరణానికి కారణం, “మీరే” అని చెప్పాడు.
ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు కొట్టడాడని చెప్పగానే
బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేసి మరి అతన్ని నిందించారు.
అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం.
ఈ రోజు ఉరితాడు నా మెడకు రావడానికి కారణం “మీరే” అని కంటతడి పెట్టాడు.
ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు.
చిన్న తప్పులే కదా అని వెనుకేసుకురాకండి అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..

దయచేసి ఈ పోస్ట్ ని అందరికి షేర్ చెయ్యండి.

SUBSCRIBE FOR MORE

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading