ఎవరు నీతో చివరి వరకు – Wife and Husband Stories in Telugu
ఒక రోజు క్లాస్ లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి ఈ రోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది. (ఆ అమ్మాయికి పెళ్లి అయి ఆరు నెలల కొడుకు ఉన్నాడు).
నీ లైఫ్ లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డ్ మీద రాయమని చెప్పింది లెక్చరర్. తను ఫ్యామిలీ మెంబర్లు, బంధువులు, స్నేహితుల పేర్లను వ్రాసింది. వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని ముగ్గురు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. తను బోర్డ్ పైన వ్రాసిన వాటిలో ముగ్గురు స్నేహితుల పేర్లను తుడిచివేసింది.
నీ లైఫ్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5గురి పేర్లను తుడిచివేయమని చెప్పింది లెక్చరర్. తను ఐదుగురు బంధువుల పేర్లను తుడిచివేసింది. అలా చెరుపుకుంటు పోగా చివరకు బోర్డ్ మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ నలుగురి పేర్లు మిగిలాయి. క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇది ఆట కాదని అపుడు అర్దయింది అందరికి.
ఇపుడు మరో రెండు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. ఇది చాలా కష్టమైన పని అని తనకు అర్థమైంది. చాలా బాధ పడుతూ అమ్మా, నాన్నల పేర్లను చెరిపింది తను. మిగిలిన రెండింటిలో మరోకటి చెరపమని చెప్పింది లెక్చరర్. తన కళ్ళవెంట నీళ్లు కారసాగాయి. అచేతన స్థితిలో వణుకుతున్న చేతులతో తన కొడుకు పేరును చెరిపింది ఏడుస్తూ.
వెళ్లి నీ సీట్ లో కూర్చోమని చెప్పింది లెక్చరర్. తర్వాత కాసేపటికి లెక్చరర్ తనను ఇలా అడిగింది. నీకు జన్మనిచ్చిన తల్లి దండ్రులను కాదని, నువు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని, బయటి వ్యక్తి అయిన భర్తను ఎందుకు ఎన్నుకున్నావు?
క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దం అలుముకుంది. తను ఏమి చెపుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరు. తను బాధతో నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది.
ఎదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు. చదువు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి ఎదో ఒకరకంగా నా కొడుకు కూడా నాకు దూరమవ్వక తప్పదు. కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే అని చెప్పింది.
ఒక్కసారిగా క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రతీ కుటుంబంలో చిన్న మనస్పర్థలు, కోపాతాపాలు, కిల్లికజ్జాలు సహజం. కానీ, జీవితంలో ఎలాంటి పరిస్థితి లోనైనా చివరి వరకు కలిసి జీవించే భార్యాభర్తలు ప్రతీ క్షణం భార్యను భర్త, భర్తను భార్య అర్ధం చేసుకుంటూ సంతోషంగా జీవించడమే అసలైన భార్యాభర్తల అనుబంధం.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.