Menu Close

Swathilo Muthyamantha Song Lyrics in Telugu – Bangaru Bullodu

వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా..
వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంటా…

స్వాతిలో ముత్యమంత.. ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా.. అంటుకుంది లోన లోనా…

అల్లో మల్లో.. అందా లెన్నో.. యాలో.. యాల…

స్వాతిలో ముత్యమంత.. ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా.. అంటుకుంది లోన లోనా…

తాకిడి పెదవుల.. మీగడ తరకలు కరిగే వేళా..
మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా..

కోకకు దరువులు.. రైకకు బిగువులు పెరిగే వేళ..
శ్రావణ సరిగమ.. యవ్వన ఘుమఘుమ లయ నీదమ్మ..
వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..
సిగ్గు యెగ్గూ చెల్లప్పా.. కాదయ్యో నీ గొప్పా…

నీలో మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల…

స్వాతిలో ముత్యమంత.. ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా.. అంటుకుంది లోన లోనా…

వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా..

తుమ్మెద చురకలు.. తేనెల మరకలు కడిగే వానా..
తిమ్మిరి నడుమున.. కొమ్మల తొడిమలు వణికే వానా..
జన్మకు దొరకని.. మన్మధ తలుపులు ముదిరే వానా..
చాలని గొడుగున.. నాలుగు అడుగుల నటనే వానా…

వానల్లోన సంపెంగ.. ఒళ్ళంతా ఓ బెంగా..
గాలి వాన గుళ్ళోనా.. ముద్దే లే జేగంట..

నాలో రూపం.. నీలో తాపం.. యాలో.. యాల…

స్వాతిలో ముత్యమంత.. ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా.. అంటుకుంది లోన లోనా…

అల్లో మల్లో… అందా….లెన్నో.. యాలో..ఓ..ఓ..యాల…

వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా..

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading