Suvvi Suvvi Suvvalamma Lyrics In Telugu – Swathi Muthyam
ఆఆ.. ఆ ఆ ఆ… అఆఅ… ఆఆఆ… ఆఆ.. ఆ ఆ ఆ…
మీరు రోజు ఇలా సాధన చేస్తారా… ఇప్పుడే మొదలు పెట్టాను…
మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా…
ఉహు… నేనిక నేర్పేదేముంది, మీరింత బాగా పాడుతుంటే…
చాల బాగా పాడుతున్నారే…
ఆఆ.. పైశడ్యం..హు మందరం ఊ…
ఆఆ.. ఉహు..హు.. ఆ ఆ… ఆహ… ఆ ఆ…
చూడండి…ఆఆ.. ఆ ఆ ఆ… అఆఅ… ఆఆఆ… ఆఆ.. ఆ ఆ ఆ…
అదేంటండి… మీరు పక్కనుంటే… నేను గొంతు విప్పితే చాలు… మంచి రాగమైపోతుంది.
నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే… మధ్యమావది…
నిసరిమ పనిసరి నిరిరిస నిపమపని సా నిపరిమరీ నీసా…
తానననా తానానా తదరీ నా ఆఆ ఆ..
ఇది మా సంబరాల్లో పాడుకునే సీతమ్మవారి పాట…
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ.. ఊహు
గువ్వ మువ్వ సవ్వాడల్లే… నవ్వాలమ్మ…
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ…
ఆ ఆ… ఆ ఆ.. ఆ ఆ…
సువ్వి సువ్వి సువ్వాలమ్మ… సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వీ…
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ…
ఓఓహో హో… ఓ… అండా దండా ఉండాలని… కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని… కోదండా రాముని నమ్ముకుంటే…
గుండే లేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేసాడా
గుండే లేని మనిషల్లే…
గుండే లేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేసాడా…
అగ్గిలోనా దూకి… పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు…
నెగ్గేవమ్మ ఒక నాడు… నింగీ నేల నీ తోడు…
నెగ్గేవమ్మ ఒక నాడు… నింగీ నేల నీ తోడు…
సువ్వి సువ్వి సువ్వీ…
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ…
చుట్టూ ఉన్నా చెట్టు చేమ… తోబుట్టువులింకా నీకమ్మ…
చుట్టూ ఉన్నా చెట్టు చేమ… తోబుట్టువులింకా నీకమ్మ…
ఆగక పొంగే కన్నీళ్ళే… నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ…
ఆగక పొంగే కన్నీళ్ళే… నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ…
పట్టిన గ్రహణం విడిచి… నీ బ్రతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు… చూస్తున్నాడు పై వాడు…
వస్తుందా ఆ నాడు… చూస్తాడ ఆ పైవాడు…
సువ్వి సువ్వి సువ్వీ…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.