Menu Close

Surya Kireetame Neeva Song Lyrics In Telugu – Preminchukundam Raa

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Surya Kireetame Neeva Song Lyrics In Telugu – Preminchukundam Raa

సూర్య కిరీటమే నీవా… చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి ||2||

పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ… నీ సరి ఎవ్వరు లేరే భామ
నీ తోనే పుట్టింది ప్రేమా

కన్నెశకుంతలే నీవా… కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వనవాసినీ కావేరి
సూర్య కిరీటమే నీవా… చంద్రసుమానివే నీవా

సొగసు భారమోపలేక… నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే… జఘనమయ్యిందా
తుమ్మెద ఎరగని తేనె పువ్వా… సౌందార్యానికి తావి నువ్వా
ప్రియమార దరి చేర రావా..!!

సూర్య కిరీటమే నీవా… చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading