Sudhamadhura Kiranala Arunodayam Lyrics In Telugu – Telugu Christian Songs

Sudhamadhura Kiranala Arunodayam Lyrics In Telugu – Telugu Christian Songs
సుధామధుర కిరణాల… అరుణోదయం
కరుణామయుని శరణు… తరుణోదయం ||2||
తెరమరుగు… హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల… మరుగైనది
సుధామధుర కిరణాల… అరుణోదయం
కరుణామయుని శరణు… తరుణోదయం ||2||
దివి రాజుగా… భువికి దిగినాడని
రవి రాజుగా… ఇలలో మిగిలాడని
నవలోక గగనాలు… పిలిచాడని
పరలోక భవనాలు… పిలిచాయని
ఆరని జీవన జ్యోతిగ… వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను… ఊయల చేసింది ||2||
ఆ జన్మమే… ఒక మర్మమై
ఆ బంధమే… అనుబంధమై ||2||
సుధామధుర కిరణాల… అరుణోదయం
కరుణామయుని శరణు… తరుణోదయం ||2||
లోకాలలో పాప శోకాలలో…
ఏకాకులై బ్రతుకు అవివేకుల… ||2||
క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా
ప్రేమానురాగాలే స్థిర ఆస్తిగా..
నమ్మిన వారిని రమ్మని… పిలిచే రక్షకుడా యేసు
నిత్య సుఖాల జీవజలాల… పెన్నిధి ఆ ప్రభువు ||2||
నిను కావగా… నిరుపేదగా
జన్మించెగా… ఇల పండుగ ||2||
సుధామధుర కిరణాల… అరుణోదయం
కరుణామయుని శరణు… తరుణోదయం ||2||
తెరమరుగు… హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల… మరుగైనది
Sudhamadhura Kiranala Arunodayam Lyrics In Telugu – Telugu Christian Songs