Menu Close

శ్రుష్టిని ముందుకు నడిపించే ప్రక్రియే “శృంగారం”, నీచంగా చూడాల్సిన అవసరం లేదు.


ప్రస్తుత కాలంలో ఉండే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ధీని గురుంచి తెలుసుకోవాల్సిన అవసరం చాలా వుంది. అశ్లీలగా కాకుండా ధర్మంగా, జ్ఞానంగా చూపించేదే సనాతన ధర్మము యందు ఉండే శాస్త్రాలలో ఉన్న కామసూత్ర!, దానిని నీచంగా చూడాల్సిన అవసరం లేదు, వారు కూడా గతంలో ఒక శుక్ర కణం అనే సంగతి మరచిపోయారు అని అర్ధం.

కోపం, బాధ, ఆవేశం వస్తే ఎలా ప్రవర్తిస్తామో…. మనసులో సహజంగా కలిగే కోరికతో శరీరం యొక్క పనితీరు “శృంగారం” కింద పని చేస్తుంది!

శృంగారం అనేది చాలా శక్తివంతమైనది. శరీరంలో ఉండే శక్తిని ఇరువురు మార్చుకునే నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.
శరీరాలే కాదు ఇరువురి ఆత్మలో ఒకరికొకరు చూసుకునే విదంగా చేస్తుంది. తాము ఒకరు ఉన్నారు అనేది మైమరిచి తమలో ఉండే విశ్వంలో తెలుతూ బ్రహ్మానందాన్ని కలగజేస్తుంది. అతి ముఖ్యంగా బంధాన్ని బలపరుస్తుంది.

వేదం కామాన్ని అగ్నితో పోలుస్తుంది. అది ఒక యజ్ఞం.. “విశ్వయజ్ఞ” అని మరో పేరు! రెండు శరీరాలు తమ శక్తిని త్యాగం చేసి మరో శరీరాన్ని తయారుచేయడానికి కావలసిన రసాయనాన్ని తయారుచేసే విధానమే “శృంగారం” అంటారు! అటువంటి త్యాగం చేసారు కనుకనే మన యొక్క తల్లీతండ్రులు అంత గొప్పవాళ్ళు. వారు లేనిదే మనం లేము, ఈ లోకాన్ని చూసే అద్రుష్టం కోల్పోతాము.

సృష్టికి మూలం స్త్రీ కనుక తన ఘభాన్ని (Ovary) గర్భలోకం అంటారు! పురుషుడు తన యొక్క తేజస్సుని తన ధర్మపత్ని అయినటువంటి ఆమె గర్భలోకమునందు ఉంచితే కాలచక్రంలో ఉండేటువంటి ఎన్నో జీవులలో (ఎప్పుడెప్పుడు శరీరం దొరుకుతుందా అని ఎదురుచూసే ఆత్మలు)
కొంత పురుషుని యొక్క శుక్రకణాల రూపంలో అటువంటి ఘర్భలోకానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. ఎన్నో కోట్ల కణాలలో కేవలం ఒక్కటే వెళుతుంది. అలా వెళ్లి విజేతగా బయటు వచ్చినవాళ్ళమే మనం! అందుకే శరీరం, మన జీవితం ఎంతో విలువైనవి.

స్త్రీ యొక్క భగరంధ్రము ఘర్భలోకానికి ఉన్న ద్వారం. అది అగ్ని కుండలాంటిది. శ్రుష్టికి మూలం. కనుక పురుషుని యొక్క తేజస్సు ఆ అగ్ని కుండలో ఉంచడం చేత ఇరువురు కలిసి ఒక రసాయనాన్ని తయారు చేస్తారు శ్రుష్టి చేయడానికి… అటువంటి రసాయనం చేత రూపాన్ని దాల్చుకునేదే పిండం. అందుకే భర్త నారాయణుడు, భార్య లక్ష్మీ దేవి అంటారు! అంటే ఇరు మహా శక్తులు కలవడం చేత మరో శక్తిని తయారుచేసి శ్రుష్టిని ముందుకు తీసుకువెళుతుంటారు.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
18
+1
11
+1
0
Posted in Health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading