అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
ఇన్ని రోజులకి ఈ కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కొద్ది రోజుల క్రితం వైజాగ్ లో సృజన పెళ్లి పీటల మీదే కుప్ప కూలిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ప్రేమ వ్యవహారమే సృజన మృతికి కారణమని తేల్చారు. పీఎం పాలెం పోలీసులు ఈ కేసుని ఎట్టకేలకు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన తన ప్రాణాలను కోల్పోయిందని వివరించారు. సృజన మృతికి మూడు రోజుల ముందు ఏమి జరిగింది అనే విషయాలను పోలీసులు వివరించారు.
కొత్త పెళ్లి కూతురు సృజన.. బాలు(పేరు మార్చడం జరిగింది) అనే మరో యువకుడిని ప్రేమించింది. సృజన ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచే వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. బాలు పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. పెళ్ళికి మూడు రోజుల ముందు సృజన బాలు తో ఇన్స్టా గ్రామ్ లో చాట్ చేసింది.

Srujana Case Mystery Revealed in Telugu
ఈ పెళ్లి వద్దని.. ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని సృజన బాలు ని కోరింది. అయితే.. తనకు సరైన ఉద్యోగం లేదని.. పెళ్ళికి కనీసం రెండేళ్ల సమయం అయినా కావాలని బాలు పేర్కొన్నాడు. దీనితో పెళ్లి ఆపడానికి ట్రై చేస్తానని సృజన బాలు తో చాట్ లో పేర్కొంది. అయితే.. పెళ్లి ఆపడం కోసమే సృజన విషం తీసుకుంది.
అయితే డోస్ ఎక్కువ అయిపోవడంతో ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది. బాలు తో చాట్ చేసిన తరువాత ఆమె తన డేటా మొత్తాన్ని డిలీట్ చేసింది. అయితే డయల్ రికార్డులను రికవర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.