ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఈ కథలో ఆనందం యొక్క నిజమైన రహస్యం ఉంది – Source of Happiness
ఈ రోజు నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చే దారిలో ఆపిల్స్ కనిపించాయి. సరే తీసుకుందాము అని ఒక చోట ఆపి ఎంత అని అడిగాను. ఆ బండి అతను K G 200 అన్నాడు. నాకు ఎప్పుడూ రెండూ, మూడు చోట్ల రేట్లు అడిగి కొనే అలవాటు వుంది.
ఇంకో రెండు మూడు చోట్ల చూశాను. పళ్ళు ఇంతక ముందు చూసినంత బాలేదు అయిన ఎంత అని అడిగా వాళ్ళు K G 170 /180 అని చెప్పారు. అలాగే చూసుకుంటూ వస్తుంటే ఒక బండిలో పండ్లు కొంచెం పర్లేదు అనిపించి ఆగి ఎంతండి అని అడిగా.. అతను 150 అని చెప్పాడు. బేరం ఆడకుండా 300 రూపాయలు ఇచ్చి రెండు కేజీలు తీసుకున్నా..
ఒకవేళ అతను 170 చెప్పుంటే నేను బేరం ఆడేవాడ్ని అనుకుంటా. 160 కి సెటిల్ అయ్యేదేమో బేరం. కానీ అప్పుడు ఇద్దరము అసంతృప్తిగా ఉండేవాళ్లం. పది రూపాయలు ఎక్కువ ఇచ్చానని నేను, పది రూపాయలు తక్కువ అమ్మానని అతను.
సరే ఇప్పుడు ఈ చిన్న కథలో ఆనందం యొక్క నిజమైన రహస్యం ఉంది, మీరు గమనించారా ..? ఏదైనా మీరు ఇతరుల నుండి వీలైనంత తక్కువగా ఆశించాలి. అలానే, మీరు వీలైనంత ఎక్కువ ఇతరులకు అందజేయాలి.
కానే మనం ఎప్పుడూ దీనికి విరుద్ధంగా చేస్తాము.
మీరు ఇతరుల నుండి తక్కువ ఆశించినప్పుడు, అది జరగడానికి ఎక్కువు ఆస్కారం వుంటుంది.. అలానే మీరు ఎంత ఎక్కువు ఆశిస్తే అది అంత తక్కువుగా జరిగే అవకాశం వుంటుంది..
ఏమంటారు ..?
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చెయ్యండి.
ఓ తరం ఆడవారి జీవితాలు – Women in India
మీ కోడలి సంపాదన ఎంత – Women Financial Status