ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Sogasu Chooda Tarama Song Lyrics in Telugu – Mister Pellam
సొగసు చూడ తరమ
హ హ హ
సొగసు చూడ తరమ
హ హ హ
నీ సొగసు చూడ తరమ
నీ సొగసు చూడ తరమ
నీ ఆప సోపాలు నీ తీపి శాపాలు
యెర్రాని కోపాలు ఎన్నెల్లో దీపాలు
అందమె సుమా
సొగసు చూడ తరమ
నీ సొగసు చూడ తరమా
అరుగు మీద నిలబడి
నీ కురులను దువ్వే వేళా
చేజారిన దువ్వెన్నకు
బేజారుగా వంగి నప్పుడు
చిరు కోపం చీర గట్టి
సిగ్గును చెంగున దాచి
బగ్గు మన్న చక్కదనం
పరుగో పరుగెత్తి నప్పుడు
ఆ సొగసు చూడ తరమ
నీ సొగసు చూడ తరమా
పెట్టి పెట్టని ముద్దులు
యిట్టె విదిలించి కొట్టి
గుమ్మెతే సోయగాల
గుమ్మలను దాటు వేళా
చెంగు పట్టి ర రమ్మని
చలగాటకు దిగుతుంటే
తడి బారిన కన్నులతో
వీడు వీడు అంటున్నప్పుడు
ప్లీజ్ ప్లీజ్ వదలండి ఉమ్మ్
వీడు వీడు అంటున్నప్పుడు
ఆ సొగసు చూడ తరమ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ ఆ
పసిపాపకు పాలిస్తూ
పరవశించి వున్నప్పుడు
ఉమ్మ్ హ్మ్
పేద పాపాడు పాకివచ్చి
మరి నాకో అన్నప్పుడు
మొట్టి కాయ వేసి
చి పోండి అన్నప్పుడు
నా ఏడుపూ నీ నవ్వులు
హరివిల్లై వెలిసి నప్పుడు
ఆ సొగసు చూడ తరమ
నీ సొగసు చూడ తరమా
సిరి మల్లెలు హరి నీలపు
జడలో తురిమి
క్షణమే యుగమై వేచి వేచి
చలి పొంగులు తొలి కోకాల
ముడిలో అదిమి
అలసి సొలసి కన్నులు వాచీ
నిట్టూర్పుల నిసి రాత్రి లో
నిద్దరోవు అందాలతో
త్యాగరాజ కృతిలో
సీతాకృతి గల ఇటువంటి
సొగసు చూడ తరమ
నీ సొగసు చూడ తరమా
Sogasu Chooda Tarama Song Lyrics in Telugu – Mister Pellam