ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
సొగసు చూడ హాయి హాయిలే
తెలిసె నేడు ఇంత హాయి… హాయి హాయి
చెలియ చూపు నీకు హాయిలే
చెలిమిలోన ఉంది హాయి హాయి
అందాలు చూడ జన్మ చాలునా
అందించగానె ఆశ తీరునా
అహో, ఇదెంత వింత మోహమో
సొగసు చూడ హాయి హాయిలే
తెలిసె నేడు ఇంత హాయి… హాయి హాయి
ఆ హా హ ఆహహా అహాహ అహాహ హాహ హాహ హా
నువ్వంటే నేనంటు… నేనంటే నువ్వంటు
నీవెంట నేనుండనా
నీ నవ్వే ముద్దంటు… ఇంకేమి వద్దంటు ముడిపడనా
నీకోసం పుట్టాను, నీ దారే పట్టాను… నీమీదే ఒట్టేయనా
నా చేత చెయ్యెట్టు… నన్నిట్టా జోకొట్టు ఒడిలోన
చెట్టా పట్టా కట్టేదెట్టో… ఇట్టే చెప్పేయాలమ్మా
చెట్టు పుట్ట చూసే వేళ తప్పేదెట్టయ్యా
కుమారి చెంపకెన్ని కెంపులో… వరించు కళ్ళకెన్ని రంగులో
అహో, ఇదెంత వింత మోహమో
నా పాలబుగ్గల్లో దీపాల సిగ్గుల్లో… నీపాలు పంచివ్వనా
ఈ వెండి వెన్నెల్లో… నీ గుండె చప్పుళ్లు వినలేనా
హద్దుల్ని దాటాలి, వద్దన్న చూడాలి… నీ కన్నె కవ్వింపులు
కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి పదనిసలు
నిన్న మొన్న లేనేలేని వైనం… ఎంతో బాగుంది
వన్నె చిన్నె ఊరించాకే… ప్రాణం లాగింది
సయ్యాటలాడ ఎంత తొందరో
వయ్యారి ఈడుకెన్ని చిందులో
సుఖాల తీరమెంత దూరమో
సొగసు చూడ హాయి హాయిలే
తెలిసె నేడు ఇంత హాయి… హాయి హాయి
చెలియ చూపు నీకు హాయిలే
చెలిమిలోన ఉంది హాయి హాయి
అందాలు చూడ జన్మ చాలునా
అందించగానె ఆశ తీరునా
అహో, ఇదెంత వింత మోహమో