Menu Close

Snehithuda Snehithuda Lyrics In Telugu-Sakhi

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

నిన్న మునిమాపుల్లో… నిన్న మునిమాపుల్లో
నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపొతావో… ఇలా డోలలూగేవో
ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో
నిన్ను వలపించా… మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో… నలుపే చుక్కల్లో
కురుల నొక్కుల్లో… నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే… నా గర్వమణిగెనులే

స్నేహితుడా స్నేహితుడా… రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే… అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం… ఇదే వలపు గెలుపు
శ్వాస తుది వరకూ వెలిగే వేదం
వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా… రహస్య స్నేహితుడా

చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్
ఈ జీవితాన పూలపుంత వెయ్యవోయ్
మనసే మధువోయ్
పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా
నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళు తెరిచి… ఆవు వెన్న పూసి
సేవలు శాయవలెరా
ఇద్దరమొకటై కన్నీరైతే… తుడిచే వేలందం

స్నేహితుడా స్నేహితుడా… రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే… అల్లుకున్న స్నేహితుడా
నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో
ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో
నిన్ను వలపించా… మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో… నలుపే చుక్కల్లో
కురుల నొక్కుల్లో… నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే… నా గర్వమణిగెనులే

శాంతించాలి పగలెంటి పనికే, ఏ ఏఏ ఏ
శాంతించాలి పగలెంటి పనికే
నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలే పొద్దు వలపే
ఉల్లన్ చొక్క ఆరబోసే వయసే
నీటి చెమ్మచెక్కలైనా నాకు వరసే
ఉప్పు మూటే అమ్మెయ్ నా

ఉన్నట్టుండెత్తెస్తా ఎత్తేసి విసిరేస్తా
కొంగుల్లో నిన్నే దాచేస్తా, ఆఆ
వాలక పొద్దు విడుదల చేసి… వరమొకటడిగేస్తా, ఆఆ

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే… అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం… ఇదే వలపు గెలుపు
శ్వాస తుది వరకూ వెలిగే వేదం
వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా… రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే… అల్లుకున్న స్నేహితుడా

Like and Share
+1
5
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading