Menu Close

Sivaranjani Navaragini Lyrics In Telugu – Thoorpu Padamara

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Sivaranjani Navaragini Lyrics In Telugu – Thoorpu Padamara

ఆ ఆఆ ఆ ఆఆ…. ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృతవాహిని
ఆఆ ఆ, శివరంజనీ నవరాగిణీ, ఆఆ ఆ ఆ

రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
స్వర సుర ఝురీ తరంగానివీ
స్వర సుర ఝురీ తరంగానివీ
సరస హృదయ వీణా వాణివి
శివరంజనీ నవరాగిణీ, ఆఆ ఆ ఆ

ఆ కనులు… పండు వెన్నెల గనులు
ఆ కురులు… ఇంద్రనీలాల వనులు
ఆ కనులు… పండు వెన్నెల గనులు
ఆ కురులు… ఇంద్రనీలాల వనులు
ఆ వదనం… అరుణోదయ కమలం
ఆ అధరం… సుమధుర మధుకలశం
శివరంజనీ నవరాగిణీ, ఆఆ ఆ ఆ

జనకుని కొలువున అల్లనసాగే… జగన్మోహిని జానకి
వేణుధరుని రధమారోహించిన… విధుషీమణి రుక్మిణీ
రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా

రావే ఏ ఏ, రావే నా శివరంజనీ
మనోరంజనీ రంజనీ నా రంజనీ
నీవే నీవే నాలో పలికే నా దానివీ
నీవే నా దానివీ, నా దానివి… నీవే నాదానివీ

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading