Menu Close

Sirulolikinche Chinninavvule Lyrics In Telugu – Yamaleela

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Sirulolikinche Chinninavvule Lyrics In Telugu – Yamaleela

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు…
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు…
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు…

ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన…
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా…
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు…

సిరులొలికించే చిన్నినవ్వులే… మణి మాణిక్యాలు…
చీకటి ఎరుగని బాబు కన్నులే… మలగని దీపాలు…
జాబిల్లి జాబిల్లి జాబిల్లి… మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి…

నాలో మురిపెమంతా… పాలబువ్వై పంచనీ…
లోలో ఆశలన్ని… నిజమయేలా పెంచనీ…

మదిలో మచ్చలేని… చందమామే నువ్వనీ…
ఊరువాడ నిన్నే… మెచ్చుకుంటే చూడనీ…
కలకాలము… కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో… పసిపాపల్లే చేరుకోనీ…

సిరులొలికించే చిన్నినవ్వులే… మణి మాణిక్యాలు…
చీకటి ఎరుగని బాబు కన్నులే… మలగని దీపాలు…
బుడిబుడి నడకల తప్పటడుగులే… తరగని మాన్యాలు…
చిటిపొటి పలుకుల… ముద్దుమాటలే మా ధనధాన్యాలు…

వేశా మొదటి అడుగు… అమ్మ వేలే ఊతగా…
నేర్చా మొదటి పలుకు… అమ్మ పేరే ఆదిగా…

నాలో అణువు అణువు… ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా… అమ్మ ఋణమే తీరగా…
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ…
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా…

సిరులొలికించే చిన్నినవ్వులే… మణి మాణిక్యాలు…
చీకటి ఎరుగని బాబు కన్నులే… మలగని దీపాలు…
బుడిబుడి నడకల తప్పటడుగులే… తరగని మాన్యాలు…
చిటిపొటి పలుకుల… ముద్దుమాటలే మా ధనధాన్యాలు…

ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన…
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా…
మహరాజులా… జీవించాలి నిండు నూరేళ్లు…

సిరులొలికించే చిన్నినవ్వులే… మణి మాణిక్యాలు…
చీకటి ఎరుగని బాబు కన్నులే… మలగని దీపాలు…

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading