ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Sirimalle Puvva Lyrics In Telugu – Padaharella Vayasu
సిరిమల్లె పువ్వా…
సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా… చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే, నా తోడూ ఎవరే… ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా… చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే, నా తోడూ ఎవరే… ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా…
తెల్లారబోతుంటే… నా కల్లోకి వస్తాడే
కళ్లారా చూద్దామంటే… నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు… నా ఈడుజోడు ఏడే
ఈ సందెకాడ… నా సందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి… వాడెన్నాళ్ళకొస్తాడో
సిరిమల్లె పువ్వా…
సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా… చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే, నా తోడూ ఎవరే… ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా…
కొండల్లో కోనల్లో… కోయన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో… ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై… మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు… రేయంత వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులు దాటి… వాడేన్నాళ్ళకొస్తాడో
సిరిమల్లె పువ్వా…
సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా… చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే, నా తోడూ ఎవరే… ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా… సిరిమల్లె పువ్వా… సిరిమల్లె పువ్వా