Sirimalle Neeve Lyrics In Telugu – Panthulamma
సిరిమల్లె నీవే… విరిజల్లు కావే
వరదల్లె రావే… వలపంటే నీవే
ఎన్నెల్లు తేవే… ఎద మీటిపోవే
సిరిమల్లె నీవే… విరిజల్లు కావే
ఎలదేటి పాట… చెలరేగే నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోట… పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే… నా బ్రతుకు నీదే
తొలి పూట నవ్వే… వన దేవతల్లే
పున్నాగ పూలే… సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే… ఎద మీటిపోవే
సిరిమల్లె నీవే… విరిజల్లు కావే
ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆ ఆ ఆ ఆఆ
మరుమల్లె తోట… మారాకు వేసే
మారాకు వేసే… నీ రాకతోనే
నీ పలుకు పాటై… బ్రతుకైన వేళ
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే… నా బ్రతుకు నీవే
అనురాగామల్లె సుమగీతమల్లె
నన్నల్లుకోవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే… ఎద మీటిపోవే
సిరిమల్లె నీవే… విరిజల్లు కావే
ఆహాహా హాహా… లలలాల లాల
Like and Share
+1
1
+1
1
+1