ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఏ… సిలకా సిలకా గోరింకా… ఎగిరే ఎగిరేవేందాకా
దారే లేని నీ ఉరకా… ఈ దరికా మరి ఆ దరికా
ఏ… సినుకా సినుకా జారాకా…మేఘం నీదే కాదింకా
సొంత రెక్కలు కట్టాక… నీ దారేదో నీదింకా
సెలయేరుందో సుడిగాలుందో… వెళ్ళే దారిలో
చిరుజల్లుందో జడివానుందో… ఈ మలుపులో
విచ్చే పూలు, గుచ్చే ముళ్ళు… వాలే వాకిట్లో
ఏం దాగుందో ఏమో… ప్రేమనే ముంగిట్లో
ఓఓ… సిలకా సిలకా గోరింకా… నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా… నిన్నే ఆపేదెవరింకా
ఏ… సినుకా సినుకా జారింకా… వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా… దొరికిందిరా దారింకా
సెలయేరల్లే పొంగిపొర్లే ప్రేమే సంతోషం
దాన్ని అట్టేపెట్టు… నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని… ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనేపోదు… ఈ వసంతం
సిలకా సిలకా గోరింకా… నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా… నిన్నే ఆపేదెవరింకా
సినుకా సినుకా జారింకా… వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా… దొరికిందిరా దారింకా