ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఎదుటి వారు ఎలాంటి పరిస్తితిలో వున్నారో మనకు తెలియదు – Very Emotional Story in Telugu
Very Emotional Story in Telugu: అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని పిలుపు వస్తే, హాస్పిటల్ కి వచ్చాడు డాక్టర్. వెంటనే ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెత్తాడు. హాల్లో ఆపరేషన్ చేయాల్సిన పిల్లవాడి తండ్రి ఆందోళనగా, అసహనంగా అటు ఇటు తిరుగుతూ వున్నాడు. డాక్టర్ ను చూడగానే పిల్లవాడి తండ్రి కోపోద్రిక్తుడై, “ఇంత ఆలస్యం ఎందుకు అయింది? నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలీదా? బాధ్యత ఉండొద్దా?”
డాక్టర్ చిరునవ్వుతో, “మీరు ప్రశాంతంగా ఉంటే నా బాధ్యత నేను నెరవేరుస్తాను.” అన్నాడు. “ప్రశాంతంగా ఉండాలా! మీ కొడుకు ఇలాంటి పరిస్థితిలో ఉండి, వైద్యం అందక చనిపోతే ఎలా ఉంటుంది.” కోపంతో తండ్రి, డాక్టర్ మీద రంకెలు వేశాడు. డాక్టర్ చిరునవ్వు చెదరకుండా, ”మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్ధించుకోండి. ఈలోగా మా శక్తిమేర మేము శ్రమిస్తాం.” అంటూ థియేటర్ లోకి వెళ్లిపోయాడు.
“ఉచిత సలహాలు అందరూ ఇస్తారు” ఆ తండ్రికి బాగా కోపం వచ్చింది. కొన్ని గంటల తర్వాత డాక్టర్ థియేటర్ నుండి నవ్వుతూ బయటికి వచ్చి, “మీ కొడుకుకు ప్రాణాపాయం లేదు.”, “మీకేమైన సందేహాలు ఉంటే నర్సును అడగండి.” అని హడావిడిగా బయలుదేరాడు. ఆ డాక్టర్ ని చూసి ఆ తండ్రి “ఆయనంత పొగరుగా ఎలా ప్రవర్తిస్తాడు. నా కొడుకు ఎలా ఉన్నాడో నాకు చెప్పి పోవచ్చుగా” అంటూ కోపగించుకొన్నాడు.
ఆన్ని వింటూ అక్కడే విన్న నర్స్ కన్నీళ్ళు తుడుచుకుంటూ, “ఆయన కొడుకు నిన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇలా ఎమర్జెన్సీ అని పిలిస్తే తన కొడుకు అంతిమ సంస్కారాలు మద్యలోనే విడిచి వచ్చి మీ కొడుకుని రక్షించాడు. ఇప్పుడు ఆ అంతిమ సంస్కారాలు పూర్తి చెయ్యడానికి వెళ్తున్నారు.” అని చెప్పింది.
ఆ తండ్రి కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిళ్ళాయి, గుండె బరువెక్కింది. ఆ డాక్టర్ కి మనసులో క్షమించమని కోరుకున్నాడు.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు