Menu Close

శక్తిమాన్ గా రణ్‌ వీర్ సింగ్ ..! Shaktiman – Ranveer Singh

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Shaktiman – Ranveer Singh

శక్తిమాన్ గా రణ్‌ వీర్ సింగ్ ..! Shaktiman - Ranveer Singh

మన చిన్నప్పుడు ప్రతి ఆదివారం శక్తిమాన్ సినిమా కోసం ఎంతగా ఎదురు చూసే వాల్లమో గుర్తుందా..
ఇప్పుడు ఆ శక్తిమాన్ మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.
ఈ స్టోరీ రైట్స్ ను సోనీ పిక్చర్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట.
అయతే దీనిని సినిమాగా తీసుకువస్తారా? లేక సీరీస్ గా రూపొందిస్తారా? అన్నది ఇంకా తెలియదు.

ఇండియన్ బాక్సాఫీస్ తెరపై నయా ‘శక్తిమాన్’గా రణ్ వీర్ సింగ్ కనిపించబోతున్నాడు.
80లలో ఇండియన్ ఆడియన్స్ ను అద్భుతంగా అలరించిన సీరియల్స్ లో ‘శక్తిమాన్’ కూడా ఒకటి.
బాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్న సీరియల్ అది.

దూరదర్శన్ లో 500లకు పైగా ఎపిసోడ్స్ ప్రసారమైన ఈ సీరియల్ లో నటించిన ముఖేశ్ ఖన్నాను సూపర్ స్టార్ డమ్ తీసుకువచ్చింది ‘శక్తిమాన్’.
ఇక ఈ సీరియల్ సృష్టించిన బ్రాండింగ్ అంతా ఇంతా కాదు. స్కూల్ బ్యాగ్స్ నుంచి పిల్లలు వాడే ప్రతి వస్తువు,
ఆడుకునే ఆటబొమ్మలపై శక్తిమాన్ బొమ్మ ప్రత్యక్షమైందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సోనీ పిక్చర్స్ కొనుగోలు చేసింది. తాజాగా ‘శక్తిమాన్’ గా నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ వీర్ సింగ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

గతంలో ఈ సీరియల్ ను చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ మాత్రం పెరిగిన సాంకేతికతతో ‘శక్తిమాన్’ను అద్భుతంగా తిలకించవచ్చనే ఫీల్ తో ఉన్నారు.
ఇండియన్ సూపర్ మాన్ గా గుర్తింపు పొందిన ‘శక్తిమాన్’ ఇపుడు మరో సారి భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిద్దాం.

శక్తిమాన్ గా రణ్‌ వీర్ సింగ్ ..! Shaktiman – Ranveer Singh

Like and Share
+1
1
+1
0
+1
0

Subscribe for latest updates

Loading