ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Sayonara Sayonara Lyrics in Telugu – 1 Nenokkadine
చెలి చెలి చెలియా
చెదిరిన కలయా
నువు పలకని మాటలాగ
నను మార్చమాకె సఖియా
చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు చూడని చోటులాగ
నను చేయమాకె సఖియా
అలై నువ్వే నను వీడినా
వెనకే సంద్రం నేనై
ఇలా రానా నీ చుట్టూ
నిలవనా ప్రాణాలా వలై
ఓ సయొనరా సయొనరా
సయొనరా సెలవంటు
నా చె లిమికే విసరకే చీకటి తెర
॥చెలి॥
నీతో ఎన్నడూ వచ్చే నీడనై నిఘా నేనేగా
నువ్వు ఎప్పుడూ శ్వాసించే గాలినై నిఘా నేనేగా
ఓ… పువ్వులాగ నిన్ను చూడాలంటూ ముళ్లైపోతా
ముత్యంలాగ నిను దాచే ఉప్పునీరైపోతా
ఆపదొచ్చి నిను గుచ్చుకుంటే
ఆపే మొదటి గాయం నేనే ఔతా
॥సయొనరా॥
నిశ్శబ్దంలోన నీ గుండుచప్పుడై ఉంటా తోడుంటా
శబ్దాలెన్నున్నా నీ రెప్పలచప్పుడే వింటా నే వింటా
ఓ… చేదు క లలకు మేలకువలాగ వస్తా
బాధ మేలుకుంటే నిదరై కాపుకాస్తా
వేదనలికింకా వీడుకోలు పలికే చివరి కన్నీటి చుక్కైపోతా
॥సయొనరా॥