Menu Close

సరిపోదా శనివారం రివ్యూ – Saripodhaa Sanivaaram Review

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Review: సరిపోదా శనివారం రివ్యూ – Saripodhaa Sanivaaram Review

సరిపోదా శనివారం సినిమా ఎలా వుందంటే.. ?

అంటే సుందరానికి సినిమా ఫ్లాప్ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలిసి రూపొందించిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్ కానిస్టేబుల్‌గా ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Review: సరిపోదా శనివారం రివ్యూ - Saripodhaa Sanivaaram Review

వివేక్ ఆత్రేయ రచన , దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య తన డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం , ధ్వనిని జేక్స్ బిజోయ్ స్వరపరిచారు. మురళి జి. కెమెరా క్రాంక్ చేయగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేశారు.

ప్పటికే ఓవర్సీస్‌లో షోలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోలు కూడా పడ్డాయి. దీంతో తెల్లవారు ఝాము నుంచే ట్విట్టర్‌లో సరిపోదా హంగామా నడుస్తోంది. ఇప్పటికే నాని ఫ్యాన్స్ ట్విట్టర్‌ను ఊపేస్తున్నారు. అయితే ఇప్పడు ఈ సినిమాపై నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.

సరిపోదా శనివారం రెగ్యులర్, కమర్షియల్ ఫార్మాట్ మూవీ. యాక్షన్ పార్ట్, కాన్సెప్ట్ ఈ సినిమాకు పాజిటివ్ అంశాలు. ఎస్‌జే సూర్య పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఇక జేక్స్ బిజోయో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పగిలేలా ఉన్నాయి అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఫస్టాఫ్ అంత గ్రేట్‌గా లేదు. కొన్ని సీన్లు సాగదీసినట్టు ఉన్నాయి. సెకండాఫ్ ఒక్కటే బాగుంది. అదే సినిమాను కాపాడింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో మామూలుగా లేదు.. మామూలు హై కాదు.. పోతారు..మొత్తం పోతారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ఫీస్ట్‌లా ఉంటుందట. ఆర్ఆర్ మాత్రం పగిలిపోయిందంటూ ట్వీట్లు వేస్తున్నారు.

నాని ఫాన్స్ అయితే మస్ట్ వాచ్ మూవీ ఇది.

మొత్తానికి నానికి హ్యట్రిక్ హిట్ పడ్డట్టే, ఈ వారంలో థియేటర్ లకి పెద్ద సినిమాలు కూడా ఇంకా ఏమి లేకపోవడంతో సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చిన మంచి వసూళ్లను సాదించే అవకాశం వుంది.

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading