ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
సమయమా… అదేమిటంత తొందరేంటి ఆగుమా…
సమయమా…
మరింత హాయి పోగుజేయనీయుమా… చేతిలోన చేతులేసుకున్న చోటులోన
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన… శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన
ఆనంద వర్ణాల స-రి-గ-మ-
సమయమా… సమయమా… సమయమా..
కదలకే క్షణమా….
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే… వినుమా…
ఆ నింగి జాబిల్లిపై… ఏ నీటి జాడున్నదో… నే చూడలేనే అపుడే… ఏ ఏ…
ఈ నేల జాబిల్లిపై… సంతోష భాష్పాలని…
చూస్తూ ఉన్నానే ఇపుడే… ఏ ఏ…
తనే నా సగంగా… తనే నా జగంగా…
స్వరాల ఊయలూగుతుండగా…
ఏడేడు లోకాలు… ఆరారు కాలాలు…
ఆ తారాతీరాలు… ఆనంద ద్వారాలు…
విరిసి మురిసే వేళ… తీపి కురిసే వేళ…
ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు…
సమయమా… సమయమా… సమయమా..
కదలకే క్షణమా….
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే… వినుమా…