అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
పదునైన వ్యక్తిత్వానికి 17 సూత్రాలు – Rules to Improve Life Style
![telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes Rules to Improve Life Style](https://telugubucket.com/wp-content/uploads/2022/03/7a3b1effc0595dc977cc36e1bdc6a989.jpg)
1) విలువ లేని చోట మాట్లాడకు.
2) గౌరవం లేని చోట నిలబడకు.
3) ప్రేమ లేని చోట ఆశ పడకు .
4) నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు
5) నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు.
6) నిర్లక్ష్యం వున్న చోట ఎదురు చూడకు.
7) అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు.
8) వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు.
9) ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు.
10) చులకనగా చూసే చోట చొరవ చూపకు.
11) జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు.
12) భారం అనుకునే చోట భావాలు పంచుకోకు.
13) దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు.
14) నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు.
15) ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు.
16) ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు.
17) నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమనీ పెంచుకోకు.
Rules to Improve Life Style