Menu Close

Roja Roja Song Lyrics In Telugu – Premikula Roju

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Roja Roja Song Lyrics In Telugu – Premikula Roju

రోజా….. రోజా……
రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా
రోజా రోజా… రోజా రోజా రోజా… రోజా రోజా

నిన్ను చూసి నన్ను నేను… మరిచిపోయి తిరిగి వచ్చా
నిను గాలి సోకగా వదలనులే…
నెలవంక తాకగా వదలనులే…
ఆ బ్రహ్మ చూసినా… ఓర్వనులే
నే ఓర్వనులే నే ఓర్వనులే… రోజా రోజా… రోజా రోజా

కన్నులలో కొలువున్నావులే… రాతిరిలో కనులకు కునుకే లేదులే
వలువగా నన్నూ చుట్టుకోగా…నీ సన్నని నడుముకు
కలుగును గిలిగిలి… నా రోజా

నీ పేరు నానోట… నే చెప్పగా
నా ఇంట రోజాలు… పూచేనులే
నీ జాడ ఒకరోజు లేకున్నచో… నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీ రాకే మరుక్షణం… తెలుపును మేఘమే

వానలో నువు తడవగా… నా కొచ్చునే జ్వరం
ఎండలో నువు నడవగా… నాకు పట్టే స్వేదం
తనువులే రెండు… హృదయమే ఒకటి
రోజా రోజా రోజా…

రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను… మరిచిపోయి తిరిగి వచ్చా

నవ యువతీ… నడుమొక గ్రంధము
చదివేనా పలుచని… రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా…
బిడియాన్ని ఒకపరి… విడిచిన మరి తప్పేముంది

నన్నే నువ్వు తాకొద్దని… గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని… చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే…
కనులలో జారెడు… అందాల జలపాతమా
నన్ను నువ్వు చేరగా… ఎందుకాలోచన
నీ తలపు తప్ప… మరుధ్యాస లేదు… నా రోజా రోజా రోజా

రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను… మరిచిపోయి తిరిగి వచ్చా
రోజా రోజా…. రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా

Like and Share
+1
2
+1
1
+1
0

Subscribe for latest updates

Loading