రాబిన్‌హుడ్ మూవీ రివ్యూ – Robinhood Movie Review – 2025
Robinhood Movie Review – 2025: నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ మార్చి 28న (నేడు) థియేటర్లలో రిలీజైంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ పాత్రలో నటించిన ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. రాబిన్‌హుడ్ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?

మిక్స్‌డ్ టాక్: రాబిన్‌హుడ్ ఓవర్‌సీస్ ప్రీమియర్స్‌కు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. హిలేరియస్ కామెడీతో సినిమా నవ్వించిందని కొందరు నెటిజన్లు చెబుతోండగా….మరికొందరు మాత్రం రొటీన్ కమర్షియల్ మూవీ ఇదని, కొత్తగా చెప్పుకోవడానికి సినిమాలో ఏం లేదని ట్వీట్లు పెడుతోన్నారు.
మ్యూజిక్ మైనస్:: నితిన్, రాజేంద్రప్రసాద్, వెన్నెలకిషోర్ కాంబోలో వచ్చే కామెడీ సినిమా మాత్రం బాగా నవ్విస్తాయని చెబుతోన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందని అంటున్నారు. అదిదా సర్‌ప్రైజ్ తప్ప మిగిలిన పాటలు ఏవి బాగాలేదని, బీజీఎమ్ కూడా అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్‌లో థ్రిల్ పెద్దగా వర్కవుట్ కాలేదని, బోర్ ఫీలింగ్‌ను కలిగిస్తుందని చెబుతున్నారు.
ప్రెడిక్టబుల్ స్టోరీ: వెంకీ కుడుముల రాసుకున్న కథలో కొత్తదనం మిస్సయిందని, కామెడీ, లవ్ స్టోరీ, యాక్షన్ ఏది సరిగ్గా వర్కవుట్ అవ్వలేదని, స్క్రీన్‌ప్లే కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదని అంటున్నారు.ఆమె కనిపించే సీన్స్ మొత్తం క్రింజ్‌లా అనిపిస్తాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. నితిన్, శ్రీలీల కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ఇదని, గతంలో వీరిద్దరు కలిసి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా చేశారు.
క్లైమాక్స్‌లో డేవిడ్ వార్నర్ ధమాకా!
సెకండాఫ్ తర్వాత కూడా సినిమా టాక్ మారలేదు. నితిన్, శ్రీ లీల జంట గురించి పరవాలేదని టాక్ వచ్చింది. వాళ్ళిద్దరి నటన గురించి గొప్పగా చెప్పేది ఏమీ లేదట. డేవిడ్ వార్నర్ ధమాకా చూడడం కోసం క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలట. అది సంగతి. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మీద విమర్శలు వస్తున్నాయి.
పక్కా కమర్షియల్ ఫార్మాట్… రొటీన్ ట్రీట్మెంట్, యావరేజ్!
‘రాబిన్ హుడ్’ సినిమా చూసిన జనాలు దర్శకుడు వెంకీ కుడుముల రైటింగ్ మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన రచనలో ప్రతిదీ ఆర్టిఫిషియల్ కింద ఉందని, కొత్తగా ఏమీ లేదని, సినిమాలో ఒక సోల్ మిస్ అయ్యిందని చెబుతున్నారు. పక్కా కమర్షియల్ ఫార్మాటులో తీసిన ఈ సినిమా జనాలను మెప్పించడం కష్టమని కాస్త ఘాటుగా పోస్టులు చేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రొటీన్ ట్రీట్మెంట్ కమర్షియల్ ఫార్మాట్ తప్ప ఏమీ లేవంటున్నారు. స్ట్రిక్ట్లీ యావరేజ్ సినిమా అంటున్నారు.
ఇంతకీ మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యడం మరవకండి.
Trending: క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ – Adolescence – Web Series Recommendation – 2025
రెండో అభిప్రాయం తప్పనిసరి | Telugu Moral Stories