అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Relationship Quotes in Telugu – కొన్ని అనుబంధాలను నిర్వచించలేం
మనిద్దరం కలిసి ఉంటే..
మనకెదురయ్యే కష్టాలు కూడా
ఇష్టాలుగా మారిపోతాయి.
ఇతరుల భావోద్వేగాలకు స్పందించేవారు
అనుబంధాలను పదిలంగా కాపాడుకుంటారు.
అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన మూడు సూత్రాలు..
అబద్ధం చెప్పకూడదు.
మోసం చేయకూడదు.
నెరవేర్చలేని వాగ్ధానాలు చేయకూడదు.
పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అంటే..
భార్యాభర్తల్లా కొట్టుకోవాలి.
ప్రాణ స్నేహితుల్లా మాట్లాడుకోవాలి.

ఎంత బలమైన అనుబంధాన్నైనా
చిటికెలో నాశనం చేసేది అహం.
కాబట్టి దాన్నిఇప్పుడే ఇక్కడే వదిలేయడం మంచిది.
నిండు కుండను చిన్న రంధ్రం ఖాళీ చేసినట్టే
అణువంత అహం అనుబంధాన్ని దెబ్బ తీస్తుంది.
అనుబంధం రెండు హృదయాలకు సంబంధించినది.
ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తికి
ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వద్దు.

మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం.
ఒకరినొకరు ఏడిపించుకుంటాం.
గొడవ పడతాం.
అయినా ఒకరిని విడిచి మరొకరు ఉండలేం.
బలమైన అనుబంధం ఎప్పుడు పుడుతుందంటే..
తాము ప్రేమించిన వారి కోసం
దేన్నైనా త్యాగం చేయగలిన ఇద్దరు కలిసినప్పుడు.
ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం పుస్తకం లాంటిది.
రాయడానికి ఏళ్లకేళ్లు సమయం పడుతుంది.
తగలబెట్టడానికి ఒక్క క్షణం చాలు.

మీ గురించి ఎక్కువ ఆలోచించేవారిని,
మీ గురించి తాపత్రయపడేవారిని
ప్రేమించకుండా ఉండటం చాలా కష్టం.
ప్రేమించడం పెద్ద విషయం కాకపోవచ్చు.
కానీ ప్రేమను పొందడం చాలా గొప్ప విషయం.
‘నువ్వు సింగిలా?’ అని ఒకరు నన్ను అడిగారు.
వారికి నా సమాధానం ఏంటంటే..
నా స్వేచ్ఛను పోగొట్టుకునే పని ఎన్నటికీ చేయను.
అనుబంధం ప్రేమ పునాదులపై ఏర్పడుతుంది.
మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఎప్పుడూ మనస్పర్థలు కలిగించలేడు.
కానీ ఆ మనస్పర్థల వల్ల మీ మధ్య మూడో వ్యక్తి రావడానికి సరిపడ ఖాళీ ఏర్పడుతుంది.
ఫ్లర్టేషన్ షిప్: ఫ్రెండ్షిప్ కి ఎక్కువ రిలేషన్షిప్ కు తక్కువ.
కొన్ని అనుబంధాలను నిర్వచించలేం.

నిజమైన మగాడు వంద మంది అమ్మాయిలను ప్రేమించడు.
ఒకే అమ్మాయిని వంద రకాలుగా ప్రేమిస్తాడు.
నీతో ప్రేమలో ఎప్పుడు పడిపోయానో నాకు గుర్తు లేదు.
నా జీవితంలో జరిగిన అత్యద్భుతమైన విషయం ఇదే.
నువ్వు చాలా స్వీట్ పర్సన్.
అప్పుడప్పుడూ నిన్ను తినేయాలనిపిస్తుంది.
Relationship Quotes in Telugu – కొన్ని అనుబంధాలను నిర్వచించలేం