Menu Close

Ramaya Thandri Lyrics In Telugu – Sampoorna Ramayanam

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Ramaya Thandri Lyrics In Telugu – Sampoorna Ramayanam

రామయ తండ్రి ఓ రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి

రామయ తండ్రి… ఓ రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి… రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే… రామయ తండ్రి

తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకె ఇరిసావంట
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకె ఇరిసావంట
పరశరాముడంతవోణ్ణి పాలదరిమినావంట
ఆ కథలు సెప్పుతుంటె విని… ఒళ్లు మరచి పోతుంట

రామయ తండ్రి… ఓ రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి… రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే… రామయ తండ్రి

ఆగు బాబు ఆగు..!!
అయ్యా నే వత్తుండ… బాబు నే వత్తుండ
అయ్యా నే వత్తుండ… బాబు నే వత్తుండ
నీ కాలు దుమ్ము సోకి… రాయి ఆడది ఐనాదంట
నాకు తెలుసులే…
నా నావ మీద కాలు పెడితె… ఏమౌతాదో తంట
నీ కాలు దుమ్ము సోకి… రాయి ఆడది ఐనాదంట
నా నావ మీద కాలు పెడితె… ఏమౌతాదో తంట
దయజూపి ఒక్కసారి… కాళ్లు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు… నారాయణ మూర్తివంట

రామయ తండ్రి… ఓ రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి… రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే… రామయ తండ్రి

అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే
అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే
నువు దాటలేక కాదులే… రామయ తండ్రి
నువు దాటలేక కాదులే… రామయ తండ్రి
నన్ను దయ చూడగ వచ్చావు… రామయ తండ్రి

హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా లేలో హైలెస్సా
హైలెస్సా లేలో హైలెస్సా

Like and Share
+1
1
+1
0
+1
0

Subscribe for latest updates

Loading