ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ramachandraya Janaka Lyrics In Telugu – Mangala Harathi
రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ
మామకాభీష్టదాయ… మహిత మంగళం
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ… మహిత మంగళం
కోసలేశాయ మందహాస… దాస పోషణాయ
వాసవాది వినుత… సద్వరాయ మంగళం
చారు కుంకుమోపేత… చందనాని చర్చితాయ
హారకటక శోభితాయ… భూరి మంగళం
లలిత రత్నకుండలాయ… తులసీవనమాలికాయ
జలజ సదృశ దేహాయ చారు మంగళం
దేవకీ సుపుత్రాయ… దేవ దేవోత్తమాయ
బావజా గురువరాయ… భవ్య మంగళం
పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజ వాహనాయ… అతుల మంగళం
విమలరూపాయ వివిధ… వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ… శుభద మంగళం
రామదాసాయ మృదుల హృదయ… తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
Like and Share
+1
3
+1
1
+1