ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Rajyama Sanyasama Lyrics in Telugu – Baba
ప: రాజ్యమా సన్యాసమా భోగమా లేక యోగమా
జ్నానియా అజ్నానియా ఎవరురా ఇతడు ఎవరురా
అంబరం దాటిన అతిశయం బాబా జాతకం ||అంబరం||
ప్రశ్నలా బతికెలే మౌనమై వెలిగెలే ||రాజ్యమా||
చ: కొడుకులు లేని ఒడిలోకి వెలుగై వచ్చిన రాజాయే
వాసనలెన్నో పంచుటకు దైవమిచ్చిన రోజాయే
కీర్తికి బదులు భుజములపై మూటలెన్నో మోశాడు
విధి ఇది విధి ఇది అని తలచి చెమట నోడ్చి బతికాడు
ఏ వృత్తిలోనైనా తప్పులేదు అంటాడు
పనిమాని కూర్చుంటే ముప్పువుంది అంటాడు
పెరిగినా తరిగినా ఎన్నడూ తొణకడు
అతిశయం ఎంతో అతిశయం అతిశయం బాబా జాతకం
చ: దేవుడు లేడని ప్రతిపూటా బోధించాడు నాస్తికత
భౌతికవాదం మదిలోన పూసిందేలా ఆస్తికత
నుదుట విభూధిని దిద్దుకుని వస్తున్నాడు ఈ జ్నాని
ఆశ్చర్యమాశ్చర్యంగా వుండే
అయ్యా డయ్యె రాముడే
తన తల్లి ప్రేమకే తలవంచె నీబాబా
హృదయాన ఏనాడు పసివాడు ఈ బాబా
వేదనే కోరిన పెన్నిధై వెలిగెలే ||రాజ్యమా||