ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
1. ఎటువంటి కష్టం పడకుండా, ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా, మీ నాన్న ఉన్నొడనే ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పెట్టకుండా స్ట్రెయిట్గ యమ్.డి. చైర్లో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే. అమ్మ నాన్న తిప్పలుపడి స్కూల్ ఫీజు కడితే ఎల్.కే.జి. నుంచి టెన్త్ క్లాసు వరకు కష్టపడి చదివి పాసై ఇంటర్లో ఈజీగా వున్నా గ్రూపులన్నీ వదిలేసి ఎం.ప్.సి. చదివితేనే ఇంజనీరింగ్ చేయగలం అని చెప్తే, కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని, ఫిజిక్స్ కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మాథ్స్ కో ట్యూషన్ రోడ్లు పట్టుకు తిరిగి, ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అమ్మ నాన్నలని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్ లో పాస్ అవ్వడానికి ప్లాస్కులో టీ పెట్టుకొని రాత్రంతా చదివి అలారమ్ పెట్టుకుని పొద్దునే లేచి మళ్ళి చదివి, తీరా పాసయ్యాక ఎంసెట్ లో రాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికి సరైన ర్యాంకు రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మానేజిమెంట్లో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్ధంకాక ఫస్ట్ ఇయర్ నుండి ఫోర్త్ ఇయర్ దాక వున్నా అరియర్స్ అన్నీ ఒకేసారి క్లియర్ చేసి, ఈ సొసైటీ లోకొస్తే ఈ జనం అంత ఉద్యోగం లేని ఎదవా అని నీచం మాట్లాడుతున్న లెక్క చేయక, ఉద్యోగం కోసం ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ అని పిచ్చ కుక్కలా నాలుగేళ్లుగా తిరుగుతున్న నన్ను, ఎందుకు పనికి రావు తిండి దండగ తిండి దండగ అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముల్లులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్న నాకు ఎవరో ఓ మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే, దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవెర్స్ గాడిని ఎదిరించి, ఈ రోజు నీ ముందు నుంచుని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకు ఎంత పొగరుండాలి రా.
2. అమూల్ బేబీ! ఇంత వరకు రఘువరన్ ని విలన్ గానే చూసివుంటావ్, హీరోగా చూడలేదు కదా, ఇక నుంచి చూపిస్తా.
3. పాపిడి తీసి పక్కకి దువ్వి జుట్టు కళ్ళజోడు ఇవి అన్ని చూసి మంచోడని అనుకుంటున్నారు ఏమో. Actually, నేను చాల బాడ్ బాయ్ ని, నోరు తెరిస్తే నాకు భూతులే ఎక్కువ వాస్తాయి.
4. వేస్ట్ ఫెలో అనేవాడు ఎప్పుడు పొగరుగానే వుండాలి, కాస్త బెండ్ అయినా బెండు తీసేస్తారు.
5. పని పాటా లేకుండా ఇంట్లో ఉండాలంటే దానికి చాలా టాలెంట్ ఉండాలి, అందరి వాళ్ళ అవ్వదు.
6. ఫస్ట్ ఎవరు సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు. ఎవరు కరెక్ట్ టైంకి సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం.
7. ఎవర్ని పట్టుకుని ఎం అడుగుతుంన్నావ్, నేను ఎప్పుడు ఫ్రీనే…
8. మగ పిల్లలను ఏడిపించకూడదు అని, వెళ్ళి ఆడ పిల్లలకు చెప్పు
9. పక్కింట్లో ఒక అమ్మాయి ఎవరేజ్ గా వుందంటేనే చూడకుండా ఉండలేం. అలాంటిది సినిమా హీరోయిన్ల వుందంటే చూసేదాకా ఆగలేం.