Menu Close

Radha Ramanam Song Lyrics In Telugu – Thipparaa Meesam

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

రాధ రమణం… మొదలాయె పయణం
కాదా మధురం… జతచేరే తరుణం
రాధ రమణం… అది ప్రేమా ప్రణయం
కాదా మధురం… మరి చూసే తరుణం

అడుగే పరుగై బదులే మరిచే
కథలో మలుపే మొదలే
తిరిగే సమయం సెలవే అడిగే
తనతో తననే విడిచే

నాతో నడిచే సగం… ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం… ఎదురే నిలిచే నీలా

మొహమాటం తుడిచేసి… నీతో పయణించా
చిరుకోపం వదిలేసి… ఏదో గమనించా
గతమే వదిలి నీతో కదిలే… ప్రతి క్షణము ఆనందమే
ఇకపై దొరికే గురుతై నిలిచే… ప్రతి విషయం నా సొంతమే

నాతో నడిచే సగం ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం… ఎదుటే నిలిచే నీలా

చిగురంతా చనువేదో… వింతే అనిపించే
కలకాదె నిజమంటూ మాటే వినిపించే
మాటే మరిచి ఎదలో మౌనం… విన్నావా ఇన్నాళ్ళకీ
శూన్యం చెరిపి వెలుగే నిలిపి… ఉంటావా ఏనాటికీ

నాతో నడిచే సగం… ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం… ఎదుటే నిలిచే నీలా

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading