అద్భుతమైన కవిత – Rabindranath Tagore Poetry
నేనిక లేనని తెలిశాక
విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు..
కానీ మిత్రమా! అదంతా నా కంట పడదు!
ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా!
నీవు పంపించే పుష్పగుచ్ఛాలను
నా పార్ధివదేహం ఎలా చూడగలదు?
అందుకే… అవేవో ఇప్పుడే పంపరాదా!
నా గురించి నాలుగు మంచి మాటలు
పలుకుతావ్ అప్పుడు
కానీ అవి నా చెవిన పడవు..
అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !
నేనంటూ మిగలని నాడు
నా తప్పులు క్షమిస్తావు నువ్వు !
కానీ నాకా సంగతి తెలీదు.
అదేదో ఇపుడే క్షమించేయలేవా?!
నన్ను కోల్పోయిన లోటు
నీకు కష్టంగా తోస్తుంది
కానీ అది నాకెలా తెలుస్తుంది?
అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !
నాతో మరింత సమయం
గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది
అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!
సానుభూతి తెలపడానికి
నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్..
నా మరణ వార్త విన్నాక!
సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?
ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు,
బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను.
హాయిగా నీతో మెలుగుతాను!”
ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత.
అందుకే బ్రతికుండగానే
ఆప్యాయంగా పలకరించుకుందాం!
కష్టసుఖాలు పంచుకొందాం!
ఒకరికొకరమై మెలుగుదాం!
ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!
Rabindranath Tagore biography, Tagore poems, Nobel Prize in Literature, Tagore songs, Bengali literature, Tagore quotes, Gitanjali summary, Tagore’s contributions to Indian culture, Tagore paintings.
గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
Subscribe to Our YouTube Channel
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.