Menu Close

Raanani Raalenani Lyrics In Telugu – Aatma Gowravam

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Raanani Raalenani Lyrics In Telugu – Aatma Gowravam

రానని రాలేనని ఊరకే అంటావు
రావాలనె ఆశలేనిదే ఎందుకు వస్తావు
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలనె ఆశలేనిదే ఎందుకు వస్తావు

కొంటెచూపు చూడకు… గుండెకోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
కొంటెచూపు చూడకు… గుండెకోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు
వేషమైన మోసమైన… అంతా నీకోసం, ఊహూ..! అలాగా
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలనె ఆశలేనిదే ఎందుకు వస్తావు

ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది, పాపం
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది, పాపం
గుండెమీద వాలిచూడు… గోడు వింటావు, ఊఉ..! అబ్బబ్బబ్బా
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలనె ఆశలేనిదే ఎందుకు వస్తావు

దోరవయసు వేడిలో… కోరచూపు వాడిలో
దూరమైన మనసుపడే బాధ అయ్యయ్యో
దోరవయసు వేడిలో… కోరచూపు వాడిలో
దూరమైన మనసుపడే బాధ అయ్యయ్యో
కరుణచూపి కరుగకున్న… టాటా చీరియో, టాటా చీరియో

రానని రాలేనని ఊరకే అంటావు, ఊహూ..!
రావాలనె ఆశలేనిదే ఎందుకు వస్తావు

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading