ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Won National Film Award for Best Lyrics for the year 1993
Movie Name : Matrudevobhava
Language: Telugu
Singer (S) : M.M. Keeravani
Lyrics : Veturi Sundararamamurthy
Music Composer : M.M. Keeravani
Director : K. Ajay Kumar
Actors : Madhavi, Nazar
Release Date: 1993
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..
తోటమాలి నీ తోడు లేడు లే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..
లోకమెన్నడో..చీకటాయెలే..
నీకిది తెల్లవారని రేయమ్మా..
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం..(రాలిపోయే)
చెదిరింది నీ గూడు గాలిగా..
చిలక గోరింకమ్మ గాధగా..
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..
తనవాడు తారల్లో చేరగా..
మనసు మాంగల్యాలు జారగా..
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా..
తిరిగే భూమాతవు నీవై..
వేకువ లో వెన్నెలవై..
కరిగే కర్పూరము నీవై..
ఆశలకే హారతివై..(రాలిపోయే)
అనుబంధమంటేనే అప్పులే..
కరిగే బంధాలన్నీ మబ్బులే..
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే..
తన రంగు మార్చింది రక్తమే..
తనతో రాలేనంది పాశమే..
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే..
పగిలే ఆకాశం నీవై..
జారిపడే..జాబిలివై..
మిగిలే ఆలాపన నీవై..
తీగ తెగే..వీణియవై..(రాలిపోయే)
మరిన్ని అవార్డ్ విన్నింగ్ తెలుగు సాంగ్ లిరిక్స్