Raali Poye Puvva Song Lyrics In Telugu-Matru Devo Bhava - Telugu Bucket
Menu Close

Raali Poye Puvva Song Lyrics In Telugu-Matru Devo Bhava

Raali Poye Puvva Song Lyrics In Telugu & English – Matru Devo Bhava Movie Song

రాలీ పోయే పువ్వా… నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలి పోయే పొద్ద… నీకు వర్నాలేందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా, ఆ
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం

రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడూ లేడులే
వాలిపోయే పొద్ద నీకు వర్నలేందుకే
లోకమెన్నడో చీకటాయెలే

చెదిరింది నీ గూడు గాలిగా… చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా, ఆ ఆఆ ఆ
తనవాడు తారల్లో చేరగా… మనసు మాంగల్యాలు జారగా
సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై… వేకువలో వెన్నలవై
కరిగే కర్పూరము నీవై… ఆశలకే హారతివై

రాలి పోయే పువ్వా… నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్ద నీకు వర్నలేందుకే

అనుబంధమంటేనే అప్పులే… కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే… వాడి పొయే, ఆ ఆఆ
తన రంగు మార్చింది రక్తమే… తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి… దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశము నీవై… జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై… తీగ తెగే వీనియవై
రాలి పోయే పువ్వా… నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడూ లేడులే
వాలిపోయే పొద్ద నీకు వర్నాలేందుకే… లోకమెన్నడో చీకటాయెలే

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading