ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Raajaadhi Raaja Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics
రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)
విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి||
వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2) ||రాజాధి||
ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2) ||రాజాధి||
మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2) ||రాజాధి||
Raajaadhi Raaja Christian Song Lyrics in English – Christian Songs Lyrics
Raajaadhi Raaja Ravi Koti Theja
Ramaneeya Saamraajya Paripaalaka (2)
Viduvani Krupa Naalo Sthaapinchene
Seeyonulo Nunna Sthuthula Simhaasanmunu (2) ||Raajaadhi||
Varnanakandani Paripoornamaina Nee
Mahima Swaroopamunu – Naa Korake Thyaagamu Chesi (2)
Krupaa Sathyamulatho Kaapaaduchunnaavu
Dinamella Nee Keerthi Mahimalanu – Nenu Prakatincheda (2) ||Raajaadhi||
Oohalakandani Unnathamaina Nee
Uddeshamulanu Naa Yedala Saphalaparachi (2)
Ooreginchuchunnaavu Vijayothsavamutho
Yesayya Nee Kanna Thodevvaru – Leru Ee Dharanilo (2) ||Raajaadhi||
Makutamu Dharinchina Maharaajuvai Nee
Soubhaagyamunu – Naa Korake Siddhaparachithivi (2)
Nee Parishuddhamaina Maargamulo Nadichi
Nee Saakshinai Kaankshatho Paadeda – Sthothra Samkeerthanale (2) ||Raajaadhi||