అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది – Qualities of a Good Man
స్త్రీ ఎలా ఉండాలో చాల చోట్ల చదివాము కదా.. మరి
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది.
కానీ అది ఎవరికీ తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నించరు.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః,
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః,
భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం,
షట్కర్మయుక్తః ఖలుధర్మనాథః
ఎందుచేతో ఈ పద్యం ప్రాచుర్యంలో లో లేదు.
ఏమో.. సరే ఈ పద్యం యుక్కభావం చూద్దాం రండి.
కార్యేషు యోగీ అంటే పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి అని.
కరణేషు దక్షః అంటే కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి అని.
రూపేచ కృష్ణః అంటే రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి అని.
క్షమయాతు రామః అంటే ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగి ఉండాలి అని.
భోజ్యేషు తృప్తః అంటే భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి అని.
సుఖ దుఃఖ మిత్రం అంటే సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

షట్కర్మలు ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా, కొనియాడబడతాడు.
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది – Qualities of a Good Man