Punnami Rathri Puvvula Rathri Lyrics in Telugu – Punnami Naagu
పున్నమి రాత్రి..పువ్వుల రాత్రి
వెల్లువ నాలో..పొంగిన వెన్నెల రాత్రి
మగువ సోకులే మొగలి రేకులై
మత్తుగ పిలిచే రాత్రి
మరుడు నరుడిపై మల్లెలు చల్లి
మైమరపించే రాత్రి
ఈ వెన్నెలలో..ఆ వేదనలో
నాలో వయసుకు నవ రాత్రి
కలగా మిగిలే కాళరాత్రి
కోడెనాగుకై కొదమనాగిని
కన్నులు మూసే రాత్రి
కామదీక్షలో కన్నెలందరు
మోక్షం పొందే రాత్రి
నా కౌగిలిలో..ఈ రాగినితో
తొలకరి వలపుల తొలి రాత్రి
ఆఖరి పిలుపుల తుది రాత్రి