Menu Close

యథా పిండే తథా బ్రహ్మాండే – నీలోనే విశ్వం – Proof That Indian Scriptures Understood the Cosmos Long Ago


యథా పిండే తథా బ్రహ్మాండే – నీలోనే విశ్వం – Proof That Indian Scriptures Understood the Cosmos Long Ago

“నీవు విశ్వాన్ని తెలుసుకోవాలంటే, మొదట నిన్ను నువ్వు తెలుసుకో.” ఇలా ఎందుకు చెప్పానో మీకు అర్ధం కావాలంటే ఈ పోస్ట్ ని పోస్ట్ ని పూర్తిగా చదవండి.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

“యథా పిండే తథా బ్రహ్మాండే” ఈ వాక్యం భారతీయ ఉపనిషత్తులలో కనిపించే గొప్ప తత్త్వజ్ఞానం. ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆధునిక శాస్త్రంలోనూ ఎక్కువుగా వినిపిస్తోంది!

Proof That Indian Scriptures Understood the Cosmos Long Ago Hindu

దీని తత్త్వార్థం ఏమిటి?

“పిండం” అంటే మన శరీరం లేదా సూక్ష్మ స్థాయి (Microcosm)
“బ్రహ్మాండం” అంటే విశ్వం లేదా మహా స్థాయి (Macrocosm)

మనం విశ్వానికి ప్రతిరూపం. మనలో ఉన్న ప్రతి సూక్ష్మశక్తి, విశ్వంలోనూ వుంది. మన శరీరంలోని వ్యవస్థలు, విశ్వంలోని వ్యవస్థల మాదిరిగానే పని చేస్తాయి.

ఆధునిక శాస్త్రంలోని ధృవీకరణలు:

ఫ్రాక్టల్ థియరీ (Fractal Theory): ప్రకృతిలో కొన్ని ఆకారాలు చిన్న స్థాయిలో మరియు పెద్ద స్థాయిలో ఒకే రకంగా ఉంటాయి.

లోక గమనము – నదుల ప్రవాహం:
ఒక చిన్న నీటి వాగు ఎలా దారులు విడదీసుకుంటుందో, అదే విధంగా పెద్ద నదులు కూడా అనేక ప్రవాహాలు కలిపి సాగుతాయి.
చిన్న వాగు & పెద్ద నది – రెండింటిలోని ప్రవాహ నమూనా ఒకేలా ఉంటుంది.

గలాక్సీలు – విశ్వ నిర్మాణం
గమనించండి, గెలాక్సీలు కూడా స్పైరల్ ఆకారాల్లో విస్తరించాయి.
మన శరీరంలోని DNA కూడా స్పైరల్ షేప్ లోనే ఉంటుంది (Double Helix).
ఇది మైక్రోకాస్మ్ – మాక్రోకాస్మ్ అనేదానికి బలమైన ఉదాహరణ.

తేనెటీగల తట్టు (Honeycomb):
చిన్న చిన్న తేనె గుళికలు అన్నీ ఒకే అష్టభుజ ఆకారంలో ఉంటాయి.
ఇవి కలిసిపోతే ఒక పెద్ద నిర్మాణం అవుతుంది – ఇదే తరహా ఆకారంతో.
చిన్నదైనా, పెద్దదైనా పాటర్న్ ఒకటే!

సెల్ బయాలజీ (Cell Biology):
ఒక సెల్ (కోశం) స్వతంత్రంగా ఉండగలదు. కానీ అదే ఒక పెద్ద జీవికి భాగంగా కూడా ఉంటుంది.
ఇది మనుష్యులలోని జీవకోశాల పని విధానం, విశ్వంలో జీవుల ప్రవర్తనతో పోలిక కలిగి ఉంది.

న్యూరోసైన్స్ & యూనివర్స్ స్ట్రక్చర్:
హ్యూమన్ బ్రెయిన్ నెట్వర్క్స్ & విశ్వంలోని గెలాక్సీ నెట్వర్క్స్ ఒకే తరహాలో కనిపిస్తున్నాయని 2020లో ఇటాలియన్ శాస్త్రజ్ఞులు పరిశీలించారు.
మన మెదడులోని న్యూరాన్ కనెక్షన్లు & విశ్వంలో గెలాక్సీ స్ట్రక్చర్స్ కు సారూప్యత ఉంది!

ఎకోసిస్టమ్ లాజిక్:
ప్రకృతి యొక్క సమతుల్యత – ఎలా మన శరీరంలో హార్మోన్లు సమతుల్యతగా పనిచేస్తాయో, అదే ప్రకృతిలో కూడా నీరు, గాలి, అగ్ని తత్వాలు సమంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇది కూడా “యథా పిండే తథా బ్రహ్మాండే” ని గుర్తు చేస్తుంది.

ఉపనిషత్తులలో కొన్ని వాక్యాలు:

చాందోగ్య ఉపనిషత్తు:
తత్త్వమసి” – నీవే అది. అంటే నీవే ఆ బ్రహ్మాండ తత్వానికి ప్రతిరూపం.

బృహదారణ్యక ఉపనిషత్తు:
అహం బ్రహ్మాస్మి” – నేను బ్రహ్మాండమే.

ఇవన్నీ వ్యక్తిలోనే విశ్వం ఉన్నదని సూచించే వాక్యాలు.

ఇది మనకి ఏమి చెబుతుంది?

మనం చిన్నగా ఉన్నా, విశ్వంతో అనుసంధానంలో ఉన్నాం. మనం ప్రకృతి చక్రంలో భాగమే దానిని నాశనం చేయడం అంటే మనల్ని మనమే నాశనం చేసుకోవడం. శాస్త్రపరంగా కూడా మనం విశ్వానికి అద్దం వలె ఉన్నాం అనే విషయాన్ని ఇప్పుడిప్పుడే ఆధునిక శాస్త్రం అంగీకరిస్తోంది.

హిందువుగా గర్వపడాల్సిన విషియం ఇది. దయచేసి మన హిందూ మిత్రులకి ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి.

Scientific reasons behind Indian traditions,
Scientific reason behind Hindu rituals,
Scientific reason behind Indian culture,
Science in Hindu scriptures,
Hinduism and science facts

భారతీయ పురాణాలు – ఆధునిక శాస్త్రం – భారతీయ ఖగోళ విజ్ఞానం – 20+ Proofs of Advanced Astronomy in Ancient India

Share with your friends & family
Posted in Hinduism, Interesting Facts, Unknown Facts in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading