Priyathama Thama Sangeetham Lyrics In Telugu – Aalapana
త తత తత తత తత్తరర… త తత తత తా
ప్రియతమా తమా సంగీతం… విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం… అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం… జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం… విరిసె సుమములై వసంతం
త తత తర తత త… తత తరతత తత తా
రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే… హా
అహ మళ్ళి మళ్ళి నన్ను… మత్తెక్కిస్తున్నాయిలే.. హా
హో హో… రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే… హా
మళ్ళి మళ్ళి నన్ను… మత్తెక్కిస్తున్నాయిలే… హా
నాలోన లీలగా… నాగస్వరాలుగా
పూసింది లాలసా… పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో… రేరాణి వెన్నెల్లలో
ఈ మోహమెందాక పోతున్నదో… ఈ దేహమింకేమి కానున్నదో
వలపులే పిలువగా…
ప్రియతమా తమా సంగీతం…
విరిసె సుమములై వసంతం
తరతత్త తత్త తత త… తరర తరతత్త తత్త త
పూలే తేనైపోయి… నాలో వాగై పొంగెలే… హో
నిన్నే నిన్నే కోరి… నాట్యాలనే చేసేలే… హో
హో హో.. పూలే తేనైపోయి నాలో… వాగై పొంగెలే, హో
నిన్నే నిన్నే కోరి… నాట్యాలనే చేసెలే… హా
నా పాన్పు పంచుకో… ఈ బాధ తీర్చిపో
శివ రాతిరవ్వనీ ఈ రాతిరి…
తేనెల్లు పొంగాలి చీకట్లలో… కమ్మన్ని కౌగిళ్ళలో
నీ తోడు కావాలి ఈ జన్మకి… నే నీడనవుతాను నీ దివ్వెకి
పెదవులో మధువులా…
ప్రియతమా తమా సంగీతం… విరిసె సుమములై వసంతం
తరతత్త తత్త తత త… తరర తరతత్త తత్త త
అడుగుల సడే మయూరం… అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం… జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం… విరిసె సుమములై వసంతం
తరతత్త తత్త తత త… తరర తరతత్త తత్త త