అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Priya Ninu Chudaleka Song Lyrics In Telugu – Prema Lekha
ప్రియా నిను చూడలేక… ఊహలో నీ రూపు రాక
నీ తలపుతోనే… నే బ్రతుకుతున్నా
నీ తలపుతోనే… నే బ్రతుకుతున్నా
ప్రియా నిను చూడలేక… ఊహలో నీ రూపు రాక
వీచేటి గాలులను… నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడినే… నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు… తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం… విలవిలలాడే
అనుదినం కలలో… నీ కథలే
కనులకు నిదురలే… కరువాయే
ప్రియా నిను చూడలేక… ఊహలో నీ రూపు రాకా
కోవేలలో కోరితిని… నీ దరికి నను చేర్చమని
దేవుడినే వేడితిని… కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దైన… అందించరాదా
నినుకాక లేఖలనే… పెదవంటుకోదా
వలపులు నీ దరి… చేరుటెలా
మోహన పడవలే… చేర్చునులే
ప్రియా నిను చూడలేక… ఊహలో నీ రూపు రాక
నీ తలపుతోనే… నే బ్రతుకుతున్నా
నీ తలపుతోనే… నే బ్రతుకుతున్నా
ప్రియా నిను చూడలేక… ఊహలో నీ రూపు రాక