Menu Close

Preminchaa Kothhaga Lyrics in Telugu – Chintakayala Ravi


Preminchaa Kothhaga Lyrics in Telugu – Chintakayala Ravi

పల్లవి :
ప్రేమేనా… ప్రేమేనా…
హొ… ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగా నా మనసునే అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోన జరిగే ఇది
బాగుందే బాగుందే ఏదో బంధమే
సాగిందే నీతో పాదమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
ఊగిందే నీకై హృదయమే

చరణం 1
ద్వేషమే… స్నేహమై… కష్టమే… ఇష్టమై…
దూరమే… తీరమై… భారమే… తేలికై…
పంతాలే చిలిపిగ చదివిన పాఠాలై
భేదాలే చివరికి కలిసిన భావాలై
ఏనాడో చినుకల్లే మొదలైనదీ
ఈనాడే వరదైన వరమే ఇదీ
బాగుందే బాగుందే ఏదో బంధమే
మోగిందే నాలో మౌనమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
లాగిందే ఊహాలోకమే

చరణం 2
చూపులే… చిత్రమై… మాటలే… మంత్రమై…
ఊపిరే… ఊయలై… నవ్వులే… వెన్నెలై…
దేహాలే ప్రణయపు పూవుల దారాలై
ప్రాణాలే మమతల మల్లెల హారాలై
బ్రతుకంతా బ్రతికించే భావం ఇది
ప్రతిరోజూ జన్మించే మార్గం ఇది
బాగుందే బాగుందే ఏదో బంధమే
నువ్వంటే నా ప్రతిబింబమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
నీకేలే నా సగభాగమే ||ప్రేమించా||

Preminchaa Kothhaga Lyrics in Telugu – Chintakayala Ravi

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading