Premante Emitante Lyrics in Telugu – Seenu
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
యద మేలుకొలిపింది ఈ పరిచయం
ఒ…ఒ…ఒ…ఒ…ఒ…ఒ…ఒ…
నీ కళ్ళ వకిళ్ళలో తలుపు తెరిచెను ప్రేమ
మోహాల ముంగిళ్ళలో వలపు కురిసేను ప్రేమ
ఈనాడే తెలిసింది తొలిసారిగా ఎంత తీయంది ప్రేమని
ఆకాశ దీపలు ఇలా చేరగా తెర తీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో
ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ
ఈనాడు ఈ దేవితో మనసు తెలిపేను చాలా
కలలు ఒకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో