ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Premalekhe Rasenu Na Manase Song Lyrics In Telugu – Ninne Premistha
ప్రేమలేఖ రాసెను నా మనసే… ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్నా… నిను చూడాలనీ
గుండెచాటు గుసగుస నిన్నే చేరుతుందనీ
అందమైన ఊహాలోకం అందుతుందనీ
వెన్నెలమ్మ చిరునవ్వుల్ల నిన్ను రమ్మనీ
ఎదురుచూసి పలికెను హృదయం… ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం
ప్రేమలేఖ రాసెను నా మనసే… ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్నా… నిను చూడాలనీ
కనులకు తెలియని ఇదివరకెరుగని చెలిమే చూడాలనీ
ఊహల దారుల ఆశలు వెతికెను ఆమెను చేరాలనీ
ఎదసడి నాతోనే చెప్పకపోదా… ప్రియసఖి పేరేమిటో
కదిలే కాలాలు తెలుపకపోవా చిరునామా ఏమిటో
చెలి కోసం పిలిచే ప్రాణం పలికే… ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం
ప్రేమలేఖ రాసెను నా మనసే… ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్నా… నిను చూడాలనీ
కవితలు చాలని సరిగమలెరుగని… ప్రేమే నా పాటనీ
రెక్కలు తొడిగిన చిగురాశలతో… కబురే పంపాలనీ
కదిలే మేఘాన్ని పిలిచి చెప్పన… మదిలో భావాలనీ
ఎగసే కెరటాన్ని అడిగి చూడన… ప్రేమకి లోతెంతనీ
చిరుగాలుల్లో ప్రియరాగం పలికే… ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం
ప్రేమలేఖ రాసెను నా మనసే… ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్నా… నిను చూడాలనీ
గుండెచాటు గుసగుస నిన్నే చేరుతుందనీ
అందమైన ఊహాలోకం అందుతుందనీ
వెన్నెలమ్మ చిరునవ్వుల్ల నిన్ను రమ్మనీ
ఎదురుచూసి పలికెను హృదయం… ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం