ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Poojaku Velayara Lyrics in Telugu
పల్లవి:
పూజకు వేళాయెరా! రంగ
పూజకు వేళాయెరా “2”
ఇన్నినాళ్ళు నేనెటుల వేచితినొ
ఎన్నిరేలు ఎంతెంత వేగితినొ “2”
పిలువును విని, విచ్చేసితివని, నా
వలపులన్ని నీ కొరకె దాచితిని “2”
ఎవరూ పొందని ఏకాంతసేవలో
ఈవేళ తమిదీరగా నిన్నె అలరించు “పూజ”
చరణం:
ఈ నీలినీలి ముంగురులు
ఇంద్రనీలాల మంజరులు
ఈ వికసిత సితనయనాలు
శతదళ కోమల కమలాలు
అరుణారుణ మీ అధరము
తరుణమందార పల్లవము
ఎదలో పొంగిన ఈ రమణీయ పయోధరాలు
పాలకడలిలో ఉదయించు సుధాకలశాలు
ఎంత సుందరము, శిల్ప బంధురము
ఈ జఘన మండలము
సృష్టినంతటిని దాచుకున్న ఆపృధ్వీ మండలము
ఓ…. అభినవ సౌందర్యరాశీ!
ఓ…….అపూర్వ చాతుర్యమూర్తీ
నీ కటాక్షమ్ముల లాలనమ్ములో
నీ కటాక్షమ్ముల లాలనమ్ములో
మధురిమలెన్నో పొదుగుకున్ననీ
స్తన్యసుధల ఆస్వాదనమ్ములో
అప్రమేయం దివ్వానందాలను అందించే నీ
చల్లని ఒడిలో హాయిగా నిదురించ గలిగే పాపగా
నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయె తల్లీ…. తల్లీ…తల్లీ
దువ్వుకున్న ఆ నీలిముంగురులె
దూదిపింజలై పోవునులే!
నవ్వుతున్న ఆ కంటి వెలుగులే
దివ్వెల పోలిక ఆరునులే!
వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే వాడివత్తలై పోవునులే
పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే
నడుము వంగగా నీ ఒడలు క్రుంగగా
నడుము వంగగా నీ ఒడలు క్రుంగగా
నడువలేని నీ బడుగు జీవితం
వడవడ వణకునులే!
ఆశలు రేపే సుందర దేహము అస్తి పంజరమ్మౌనులే!
Poojaku Velayara Lyrics in Telugu