ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Pillaa Chaav Lyrics in Telugu – Business Man
పల్లవి :
పిల్లా చావ్వే…
ఐ లవ్ యూ అంటే… ఛీ కొట్టీ పోతావ్
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
తేరేలియే… పిచ్చెక్కిపోయే
నన్నిట్టా వదిలీ పోతావా… (2)
మంచోణ్ణే కాదా? నేన్నచ్చలేదా?
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్
మేరేలియే… ఓ సూపు సూడే
ఏంటంతా కోపం నా మీద (2)
పిల్లా చావ్వే…
చరణం : 1
చూపుల్నే ఎర గా వేసి చేపల్లే పట్టేశావ్
ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేశావ్
హస్కీగా నవ్వే నవ్వీ విస్కీలా ఎక్కేశావ్
నా దిల్లో మంచం వేసి దర్జాగా బజ్జున్నావ్
నాక్కూడా తెలియకుండా నా మనసే కొట్టేశావ్
కాబట్టే పిల్లా ఎంతో ముద్దొచ్చావ్
“తేరేలియే” “పిల్లా చావ్వే”
చరణం : 2
నీ అందం రైలింజన్తో నా మనసుని తొక్కించావ్
నన్నిట్టా భూ చక్రంలా నీ చుట్టూ తిప్పించావ్
నడుమట్టా ఇట్టా తిప్పి నను బోర్లా పడగొట్టావ్
దుప్పల్లో దోమై దూరీ నిద్దర్నే చెడగొట్టావ్
నా దారిన్నే పోతుంటే నువ్వెందుక్కనిపించావ్
నా దిక్కూమొక్కూ నువ్వే అనిపించావ్
“మేరేలియే” “పిల్లా చావ్వే”