Menu Close

Picasso Chitrama Song Lyrics In Telugu – Swayamvaram

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Picasso Chitrama Song Lyrics In Telugu – Swayamvaram

పికాసో చిత్రమా… ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి… ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని వయ్యారాలకి… కాముడే గులామ్
పికాసో చిత్రమా… ఎల్లోరా శిల్పమా

నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా
నీ నీలి కురుల కిరణాలు సోకి వసివాడె చందమామ
ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై
ఏ వింటి శరమో అది నీ కంటి వశమై
అంగాంగాన శృంగారాన్ని సింగారించగా
అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా
మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా
వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా
ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి
ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని
పికాసో చిత్రమా… ఎల్లోరా శిల్పమా

ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా
నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా
నీ చూపు తగిలి ఇక నేనుండగలనా
నా బాధ తెలిసి జత రావేమె లలనా
నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా
నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా
ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా
లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా
ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి
నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి

పికాసో చిత్రమా… ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్
పికాసో చిత్రమా… ఎల్లోరా శిల్పమా

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading