ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Pandaganti Vennelantha Lyrics In Telugu – Panthulamma
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా, అబ్బా
దండగై పోయింది సెందరయ్యా
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
సెందరయ్యా… సెందరయ్యా
సలగాలి పాట ఉంది… హాయ్ హాయ్ హాయ్ హాయ్
సంపంగి తోట ఉంది
సలగాలి పాట ఉంది… సంపంగి తోట ఉంది
ఆ ఎనక సాటు ఉంది… వెనక సాటు మాట ఉంది
ఇన్నున్నా నా సెంత… చిన్నారి లేకుంటే
ఇన్నున్నా నా సెంత… చిన్నారి లేకుంటే
ఎన్నెలేమి సేసుకోను సెందరయ్యా
ఈ ఏడి నేడ దాసుకోనూ సెందరయ్యా
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా, అబ్బా
దండగైపోయింది… సెందరయ్యా
సందరయ్యా… సెందరయ్యా
సనజాజి పందిరుంది… హా హా హా హా
తొలిరోజు తొందరుంది
సనజాజి పందిరుంది… తొలిరోజు తొందరుంది
సోకైన వాడి సూపు… సోకి సోకి సొదపెడుతుంది
ఇన్నున్నా నా సెంత… సిన్నోడ లేకుంటే
ఇన్నున్నా నా సెంత… సిన్నోడ లేకుంటే
ఎన్నెలేమీ సేసుకోను సెందరయ్యా
ఈ వన్నెలేడ దాసుకోనూ సెందరయ్యా
పండగంటి ఎన్నెలెంతా సెందరయ్యా
దండగై పోయింది… సెందరయ్యా
సెందరయ్యా.., హా హా హా, సెందరయ్యా
అర్థరాత్రి అవుతున్నాది… నిద్దరేమో రాకున్నాది
ఇద్దరుండి ఎవ్వరు లేనీ… ముద్దు ముచ్చటైతున్నాది
సుక్క బంతి పువ్వుంది… సక్కదనం పక్కేసింది
సక్కిలిగిలి సంత కాడా… జాతరేదొ చెలరేగింది
ఇన్నున్నా నా సెంత… సిన్నోడ లేకుంటే
ఇన్నున్నా నా సెంత… సిన్నారి లేకుంటే
ఎన్నెలేమి సేసుకోను సందరయ్యా
నా ఏడి నేడ దాసుకోనూ సెందరయ్యా
పండగంటి ఎన్నెలెంతా సెందరయ్యా
దండగైపోయింది…సెందరయ్యా
సెందరయ్యా… సెందరయ్యా
సెందరయ్యా… సెందరయ్యా